బౌద్ధమత సన్యాసిగా హీరో సూర్య పాత్ర ఎలా ఉండబోతోందంటే...
సూర్య 7 ఆమ్ అరివు చిత్రంలో సర్కస్ యువకుడిగా, బౌద్ధమత సన్యాసిగాను, సైంటిస్టు పాత్రలోనూ కనపించనున్నారు నటించారు. బౌద్ద మత సన్యాసిగా కన్పించే పాత్ర సినిమాకు హైలెట్ అవుతుందని తమిళ పరిశ్రమలో అంటున్నారు. బౌద్దమత సన్యాసిగా కుంగుఫూకి, మార్షిల్ ఆర్ట్స్ కు సంభందించిన కొన్ని విషయాల ప్రస్దావన ఉంటుందని, ఆ తరహా ఫైట్స ఉంటాయని, చైనాకి ఇండియాకు మధ్య సంభంధ, భాంధవ్యాలు గురించి కూడా ఇందులో చర్చించనున్నారని చెప్తున్నారు. ఈ విషయమై దర్శకుడు మురగదాస్ మాట్లాడుతూ...మా చిత్రంపై అటు అభిమానుల్లోను, ఇటు చిత్ర పరిశ్రమలోను అంచనాలు నానాటికీ అధికమవుతూనే ఉన్నాయి. ఇన్ని అంచనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం గజిని తరువాత సూర్య, నా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. మరో కారణం సూర్య మూడు పాత్రల్లో కనపించటం. అలాగే మూడో కారణం కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సూర్యకు జంటగా తొలిసారిగా తమిళ తెరకు పరిచయం కావటమని వివరించారు. సూర్య, శృతిహాసన్ జంటగా రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న 7 ఆమ్ అరివు చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మురుగదాస్‌ను 7 ఆమ్ అరివు చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారు అని అడగ్గా సూర్య, శృతిహాసన్ జంటగా నటిస్తున్న 7ఆమ్ అరివు అభిమానుల అంచనాలను మించి ఉంటుందని అన్నారు. చిత్రం జూలైలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











