పెప్సీ తెలుగు యాడ్స్‌లో సూర్య
తమిళ హీరోలు బ్రహ్మాండమైన కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. అందువల్లనే కాబోలు పెప్సీ సంస్ధ ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్న కాంపెయిన్‌కు తమిళ హీరో సూర్య బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. పెప్సీ తాగండి, హీరో అవండి పోటీని సూర్య నిర్వహిస్తున్నారు. ఆయన పెప్సీ భారీ హోర్డింగ్‌లలో, టీవీ యాడ్స్‌లో కనిపిస్తున్నారు. గజిని సినిమా ద్వారా సూర్య తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు. పెప్సీ కంపెనీ ఒక తెలుగేతర హీరోను తమ కాంపెయిన్‌కు ఎంపిక చేసుకోవడం ఇదే ప్రధమం. మరోవైపు దక్షిణాదిలో కోకాకోలా కాంపెయిన్‌లో విక్రం కన్పించనున్నాడు. ఇదే కంపెనీకి చెందిన సాఫ్ట్‌డ్రింక్ థమ్సప్‌కు చిరంజీవి ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. విక్రం కోకాకోలా కాంపెయిన్ ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications