శ్రమలోనే సంతోషం ఉంది 'గజనీ' సూర్య!
నా అసలు పేరు శరవణన్. సినిమాల కోసం సూర్యగా మారాను మళ్లీ ఆ పేరుకు ముందోక పేరు, వెనుకొక పేరు నాకు ఇష్టం ఉండదు అని చెబుతున్నా. ఆయనకి గజిని సూర్య గా బాగా పాపులర్ నేమ్ వచ్చింది. నేను హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగితే అందరూ 'గజిని" సూర్యగానే చూస్తుంటారు, పిలుస్తుంటారు. కానీ త్వరలో 'ఘటికుడు" అంటారేమో అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే త్వరలో 'ఘటికుడు" దీపావళికి విడుదలవుతోంది కాబట్టి.
ఘటికుడు సినిమా గురించి మాట్లాడుతూ సినిమా పట్ల ప్రేమ వేరు. సూర్య రెండో తరహా కథానాయకుడు. మనసారా నమ్మి చేపట్టిన వత్తి కోసం త్రికరణశుద్ది గా కష్టపడటం ఆయన నైజం. శ్రమలో ఉండే సంతోషం తెలిసిన వాణ్ని. ఇప్పటి దాకా నాశ్రమ నాకు చెడు చెయలేదు. భవిష్యత్తు గురించి బెంగా లేదు. 'ఘటికుడు" సినిమాలో చేయనివి చాలా చేశాను. పదేళ్ల కుర్రాడిగా మారాను. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ తో సాగుతుందీ సినిమా. అక్కడ ఓ బ్రిడ్జి నుంచి కిందికి దూకాను. ఇలాంటివి చాలానే ఉన్నాయి. బాలుడి పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఈ చిత్రంలో నేను ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తాను. అసలు ఆ పాత్ర ఉద్దేశం ఏమిటన్నది కూడా ఆసక్తికరం. దర్శకుడు కె.ఎస్ రవికుమార్ కథను భలే నడిపించారుంటున్నారు. మరి ప్రేక్షకుల రెస్పాన్ప్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఘటికుడూ! సారీ 'గజినీ" సూర్య! సారీ సారీ శరవణన్.


Click it and Unblock the Notifications











