గజిని కాంబినేషన్ లో వస్తున్న సినిమా..!
ఆ మధ్య వచ్చిన 'గజని' సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. సూర్య, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం హిందీలో రీమేక్ అయి, అక్కడ ఆమీర్ ఖాన్ కి కూడా పెద్ద పేరు తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్ లో వస్తున్న తమిళ చిత్రం '7 am ఆరివు'. గజనీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో దీని పట్ల కోలీవుడ్ లో చాలా అంచనాలు వున్నాయి. సూర్య ఇందులో మూడు పాత్రల్లో కనిపిస్తాడు. సర్కస్ కంపెనీలో పని చేసే కుర్రాడిగా, బౌద్ధ బిక్షువుగా, మరో యువకుడిగా కనిపిస్తాడు. అలాగే, కమల్ కూతురు శృతి హాసన్ కథానాయికగా నటిస్తున తొలి తమిళ చిత్రం కూడా ఇదే కావడం మరో విశేషం. హారీష్ జయరాజ్ సంగీత దర్శకుడిగా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి వచ్చే జూలైలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











