twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య కొత్త చిత్రం 'డూప్లికేట్‌' హాలీవుడ్ కాపీ?

    By Srikanya
    |

    సూర్య తాజాగా రంగం దర్శకుడు కె.వి ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న 'డూప్లికేట్‌'. కాజల్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రం తమిళంలో 'మాట్రాన్‌'గా తెరకెక్కుతోంది. ఇందులో సూర్య అవిభక్త కవలలుగా కనిపించబోతున్నారు. అయితే ఈ చిత్రం "స్టక్ ఆన్ యు" అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా రూపొందిందంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    "స్టక్ ఆన్ యు" చిత్రంలోనూ హీరో అవిభక్త కవలలుగా కనిపిస్తారు. దాంతో ఈ ప్రచారం జోరందుకుంది. అయితే దర్శకుడు కె.వి ఆనంద్ మాత్రం తాను థాయ్‌లాండ్‌కు చెందిన చాంగ్‌, ఈంగ్‌ అనే అవిభక్త కవలల జీవితం ఆధారంగా తెరకెక్కించారనని చెప్తున్నారు. గతంలోనూ సూర్య సూపర్ హిట్ గజనీ సైతం మెమెంటో ఆధారంగా రావటం,రంగం చిత్రం కూడా స్టేట్ ఆఫ్ ప్లే అనే చిత్రం ఆధారం కావటంతో ఈ ప్రచారం చాలా పాపులర్ అయ్యింది.

    దర్శకుడు మాట్లాడుతూ..''థాయ్‌లాండ్‌కు చెందిన చాంగ్‌, ఈంగ్‌ అనే అవిభక్త కవలల జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో సూర్య ఒక్కో సన్నివేశం కోసం మూడు, నాలుగుసార్లు నటించాల్సి వచ్చింది. ఈ పాత్రలో ఆయనను తప్ప ఇంకెవర్నీ వూహించుకోలేం. సూర్యతో నేను చేసిన 'వీడొక్కడే'కన్నా ముందే ఈ కథను తెరకెక్కించాలని అనుకున్నాం. ఇప్పటికి కుదిరింది'' అన్నారు.

    సూర్య మాట్లాడుతూ ''నా గత చిత్రాలతో పోల్చి చూస్తే ఇందులో ప్రతి సన్నివేశం కొత్తగా అనిపిస్తుంది'' అన్నారు. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు. కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వేసవవిలో భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు.

    ఇటీవలే చెన్నైలో 'మాట్రాన్‌'కి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కాజల్ హీరోయిన్ కావటం కూడా ఈ చిత్రానికి ప్లస్. సూర్య చిత్రాలు తెలుగులో గతంలో ఇక్కడ మంచి విజయం సాధించటంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజీలలో ఉంది.

    English summary
    Surya's latest film “Duplicate” has been copied from a Hollywood movie “Stuck on you”. In “Duplicate” Surya is seen as conjoined twins, this has been copied from “Stuck on you”. Bellamkonda Suresh has bagged Surya's Maatran movie Telugu dubbing rights for a whopping price and it is learnt that the Telugu version is titled Duplicate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X