అంతా ఫేక్: హీరో సూర్య ఫిర్యాదు, కేసు నమోదు!

By Bojja Kumar

హైదరాబాద్: తన పేరుతో నకీలీ ఫేస్ బుక్ పేజీ క్రియేట్ చేసి అభిమానులను తప్పదోవ పట్టస్తున్న వారిపై ప్రముఖ సౌతిండియా స్టార్, తమిళ హీరో సూర్య ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన పేరుతో కొందరు నకిలీ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారని, అవన్నీ ఫేక్ అని సూర్య కంప్లైంటులో పేర్కొన్నట్లు సమాచారం. త్వరలో సోషల్ మీడియాలో జాయిన్ అయ్యే ఆలోయనలో ఉన్నారు. ఆవిషయాన్ని అధికారికంగా త్వరలోనే తెలియజేస్తాననని సూర్య చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సూర్య తమిళ చిత్రం ‘మాస్' షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తండగా, జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రపర్‌గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Surya Files Complaint

ప్రస్తుతం సౌత్ లో హారర్ కామెడీ, హారర్ యాక్షన్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దాంతో దర్శక,నిర్మాతలు,హీరోలు ఇలాంటి చిత్రాలకు ఓటు వేస్తున్నారు.. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య కూడా ఓ సన్నివేశంలో ఘోస్ట్ తరహా గెటప్‌లో కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ చిత్రంలో సూర్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి నార్మల్ రోల్ ఒకటి కాగా, రెండోది మాత్రం చనిపోయిన ఆత్మ. రీసెంట్ గా సినిమాలోని కొన్ని సన్నివేశాలు హైదరాబాద్ కోఠి‌లోని ఉమెన్స్ కాలేజ్, సుల్తాన్ బజార్లో చిత్రీకరణ జరిపారు.

అజిత్‌, విజయ్‌ల తర్వాత వేగంగా పేరు తెచ్చుకుంటున్న నటుడు సూర్య. వైవిధ్య నటనతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినీజనాలకు కూడా దగ్గరయ్యారు. ఎప్పటినుంచో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడా ప్రాజెక్టు మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X