సూర్య ఇమేజ్ ని డామేజ్ చేయనున్న మరో హీరో...
విశాల్ హీరోగా బాల దర్శకత్వంలో రూపొందుతున్న 'అవన్ ఇవన్" చిత్రంలో సూర్య సినిమా నటుడిగా గెస్ట్ రోల్ చేస్తున్నాడట. కథానుసారం విశాల్ ఉన్న ఊళ్లోకి సూర్య వెళతాడట. అక్కడ 'సినిమా ఆర్టిస్ట్ అంటే ఏంటనుకున్నావ్" అని విశాల్ తో వాదిస్తాడట సూర్య. అందుకు బదులుగా విశాల్ నవరసాలు నటించి సూర్య దిమ్మ తిరిగిపోయేలా చేస్తాడట. ఈ సీన్ లో సూర్యకన్నా విశాల్ హైలైట్ అవుతాడని సమాచారం. సో..సూర్య ఇమేజ్ కి డామేజ్ అయ్యే సీన్ ఇది అని చెప్పొచ్చు. కానీ చిత్ర దర్శకుడు బాల మీద ఉన్న అభిమానంతో సూర్య ఈ సీన్ లో నటించడానికి ఓప్పుకున్నాడట.


Click it and Unblock the Notifications