లేటుగా వచ్చిన లేటెస్ట్ అయిపోయిన మెగా బ్రదర్స్...
తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎలా మెగాస్టార్సో ప్రస్తుతం తమిళ ఫిల్మిం ఇండస్ట్రీలో సూర్య, కార్తీ అంతటి పెద్ద స్టార్స్. వరుస విజయాలతో ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ నెంబర్ వన్ ప్లేస్ లో వున్నది సూర్యయే. ఎప్పుడో రెండు మూడేళ్లకు ఒక్క సినిమా చేసే సూపర్ స్టార్ రజనీకాంత్ ని కన్సిడర్ చేయకపోతే విజయ్, అజిత్ వంటి స్టార్లను సూర్య ఇప్పటికే అధిగమించేశాడు. అన్నని స్ఫూర్తిగా తీసుకొని హీరో అయిన సూర్య తమ్ముడు కార్తీ కూడా ఇప్పుడు తమిళంలో స్టార్ అయిపోయాడు.
మొదటి సినిమా పరుత్తివీరన్ సంవత్సరం ఆడితే రెండో సినిమా 'అయరత్తిల్ ఒరువన్" కూడా మంచి హిట్ అయింది. మూడో చిత్రం 'పయ్యా" కూడా సమ్మర్ లో సెన్సేషన్ సృష్టించింది. 'అయరత్తిల్ ఒరువన్"ని 'యుగానికి ఒక్కడు" గా తెలుగులోకి అనువదించి ఇక్కడా కొద్దో గొప్పో గుర్తింపు పొందిన కార్తీ 'పయ్యా" డబ్బింగ్ 'ఆవారా" తో ఇంకో హిట్ కొట్టాడు. తెలుగులో తనకు పెరుగుతున్న ఆదరణ చూసి కాస్త అతిగా ఫీలౌతున్న కార్తీ ఇప్పుడు ఏకంగా తన సినిమాని డబ్ చేసుకోవడానికి పది కోట్ట రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట.
కార్తీ తదుపరి చిత్రం 'నాన్ మహాన్ అల్లా" చిత్రాన్ని డబ్ చేయడానికి కొందరు ఉత్సాహపడగా మెగా బ్రదర్స్ పది కోట్లు డిమాండ్ చేశారట. కార్తీ సినిమాలను సొంతంగా తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్న సూర్య మరెవరైనా తమ సినిమాల రైట్స్ కోసం వెళితే ఇలాంటి భారీ రేట్లు చెప్పి బెదరగొతున్నాడట.


Click it and Unblock the Notifications











