మహేష్-వెంకీలా మరో ఇద్దరు సూపర్ స్టార్స్ ల మల్టీస్టారర్ చిత్రం?
సూర్య, కార్తీ అన్న, తమ్ముళ్ళు అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఎవరి స్టైల్లో వారు వరుసగా హిట్ సినిమాలు చేస్తూ టాప్ పొజిసన్ కి చేరుకున్నారు. ఈ ఇద్దరికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
'గ్యాంబ్లర్" చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 'యముడు" చిత్ర నిర్మాత జ్ఞానవేల్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాముందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











