సాధువు గెటప్ లో షాక్ ఇచ్చిన స్టార్ హీరో

By Srikanya

సూర్య, మురగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ షాక్ గురి చేస్తున్నాయి. సాధువుగా ఈ పోస్టర్స్ లో కనిపిస్తున్నారు. గజనీ చిత్రంతో ఒక్కసారిగా ఈ కాంబినేషన్ తమిళ, తెలుగు భాషల్లో స్టార్స్ అయ్యారు. దాంతో ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడే అవకాంస ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఈ రీమేక్ రైట్స్ మార్కెట్లో సంచనం క్రియేట్ చేస్తున్నాయి. స్ట్రైయిట్ హీరో సినిమాలా తెలుగులో విడుదల చేయాలని సూర్య భావిస్తున్నారు. అందుకే తెలుగు, తమిళ బాషల్లో ఒకే రోజు విడుదల ప్లాన్ చేస్తున్నారు. మరో ప్రక్కన హిందీలో సైతం గజనీ సూపర్ హిట్ అవటంతో అక్కడి వారి దృష్టి కూడా ఈ సినిమా విడుదల పైనే ఉంది. ఇక ఈ చిత్రానికి మరో క్రేజ్ శృతి హాసన్. ఇప్పుడిప్పుడే మార్కెట్ విస్తరించుకునంటున్న ఆమెకు ఈ సినిమా కీలకంగా నిలవనుంది.

సూర్య 7 ఆమ్ అరివు చిత్రంలో సర్కస్ యువకుడిగా, సన్యాసిగాను, సైంటిస్టు పాత్రలోనూ కనపించనున్నారు నటించారు న్యాసిగా కుంగుఫూకి, మార్షిల్ ఆర్ట్స్ కు సంభందించిన కొన్ని విషయాల ప్రస్దావన ఉంటుందని, ఆ తరహా ఫైట్స ఉంటాయని, చైనాకి ఇండియాకు మధ్య సంభంధ, భాంధవ్యాలు గురించి కూడా ఇందులో చర్చించనున్నారని చెప్తున్నారు.

ఈ విషయమై దర్శకుడు మురగదాస్ మాట్లాడుతూ... మా చిత్రంపై అటు అభిమానుల్లోను, ఇటు చిత్ర పరిశ్రమలోను అంచనాలు నానాటికీ అధికమవుతూనే ఉన్నాయి. ఇన్ని అంచనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం గజిని తరువాత సూర్య, నా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. మరో కారణం సూర్య మూడు పాత్రల్లో కనపించటం. అలాగే మూడో కారణం కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సూర్యకు జంటగా తొలిసారిగా తమిళ తెరకు పరిచయం కావటమని వివరించారు. సూర్య, శృతిహాసన్ జంటగా రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న 7 ఆమ్ అరివు చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X