దీపావళి టపాకాయగా సంచనం సృష్టించనున్న సెవెంత్ సెన్స్ !?
ఈ దీపావళికి పెద్ద హీరోల సినిమాలు లేనట్లే తెలుస్తోంది. దసరాకి మహేష్ బాబు దూకుడు, జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి విడుదలయ్యాయి. కానీ ఈ హవా దీపావళికి లేనట్లే తెలుస్తోంది. కానీ ఈ దీపావళికి ఇతర భాషా చిత్రాలు మాత్రం పెద్ద సంఖ్యలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
సూర్య- మురుగుదాస్ కాంబినేషన్ లో 'గజని" సృష్టించిన సంచలనం మరచిపోలేం. ఆ సినిమాను మరిపించే స్థాయిలో 'సెవన్‌త్ సెన్స్"ఉంటుంది. సైన్స్ కు చిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రమని, ఆలోచనా శక్తిని తూకం వేసే రాళ్లే లేవు. పక్షిని చూసి విమానం కనుక్కోవడమేంటి? భవిష్యత్తును మనిషి నిర్దేశించగలడా? మరణాన్ని కూడా శాసించగలడా? ఈ ప్రశ్నలకు సమాధానం తాను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చూపిస్తున్నాం అంటున్నారు మురుగుదాస్.
ఈ చిత్రంలో కథానాయికుడు సూర్యా మూడు విభిన్న వేషధారణల్లో కనిపిస్తారు. శృతిహాసన్ నాయిక. లక్ష్మీగణపతి ఫిలింస్ తెలుగులో ఈ చిత్రాన్ని అందిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గజిని చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో 'సెవెన్త్ సెన్స్"కి కూడా మంచి ఆదరణ లభిస్తుందనే టాక్ ఉంది.
కాబట్టి దీపావళి సందడంతా సూర్యదేనని, ప్రక్షకులుకు ఈ సినిమా మంచి టపాకాయ అవుతుంది చెప్పుకుంటున్నారు. సూర్య హీరోగా నటించిన 'సెవెంత్ సెన్స్" తో పాటు మొత్తం 10 చిత్రాల వరకు ఈ దీపావళి సీజన్ లో విడుదలవుతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎన్ని సినిమాలు హిట్, ఎన్ని ఫట్ అనేది దీపావళి తర్వాత కానీ చెప్పలేం.


Click it and Unblock the Notifications











