కమల్ పదిపాత్రల రికార్డుని ఇరవై పాత్రలతో ఆ హీరో బ్రేక్ చేస్తున్నాడు
కమల్ హాసన్ నటించిన 'దశావతారం" చిత్రంలో పది పాత్రలలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. ఇది దృష్టిలో పెట్టుకుని తమిళ హీరో సూర్య ఇప్పుడు ఇరవై పాత్రల్లో కనిపించటానికి రెడీ అవుతున్నాడు. కాజల్ తో నటిస్తున్న 'మాట్రన్" అనే చిత్రంలో సూర్య 20 పాత్రలు పోషిస్తూ కమల్ రికార్డును బద్దలు చేయనున్నాడు. ఈ చిత్రానికి కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు కనుక చిత్రంలో విషయం ఉంటుందని అందరికీ అర్థమైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వార్త టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా కోలీవుడ్‌లో చెలామణి అవుతోంది. 20 పాత్రల్లో నా నటన సరికొత్తగా చూపించేందుకే ప్రయత్నిస్తానని కేవలం రికార్డు కోసం ఇది చేయడంలేదని సూర్య చెప్తున్నాడు. ఇక కెవి ఆనంద్ దర్శకత్వం వహించిన కో చిత్రం తమిళంలో పెద్ద హిట్ కాగా తెలుగులోనూ రంగం పేరుతో డబ్ చేసి వదిలిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











