ఇక ఆ సినిమా ప్రమోట్ చెయ్యనంటూ స్టార్ హీరో..

By Srikanya

తను నటించిన సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోగానే ఆ సినిమాను ప్రమోట్ చెయ్యాలంటే ఎంతటి హీరోకైనా ఆసక్తి చచ్చిపోతుంది. తాజాగా ఇదే పరిస్దితిని సెవెంత్ సెన్స్ ఎదుర్కొంటోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి ఆంధ్రాలో ప్లాప్ టాక్ వచ్చింది. దాంతో సూర్య ఇక్కడికి వచ్చి ప్రమోట్ చేయనని తెగేసి చెప్పేసాడు. దాంతో నిర్మాతలు మండిపడుతున్నారు. సూర్య ఇక్కడకు వస్తే కలెక్షన్స్ పుంజుకుంటాయని వారు చెప్తున్నారు. తాము దాదాపు 12 కోట్లు పెట్టి తీసుకున్న చిత్రాన్ని ఇలా చెయ్యటం పద్దతి కాదంటున్నారు. తాను బిజీగా ఉన్నానని ప్రమోషనల్ క్లిప్పింగ్స్ పంపుతానని సూర్య చెప్పాడని, వాటిని టీవిల్లో వేసుకోవటం తప్ప చేయగలిగింది లేదని ప్రొడక్షన్స్ హౌస్ వారు భాదపడుతున్నారు. ఇక తెలుగు వెర్షన్ ని గతంలో ఎన్నో సూపర్ హిట్ డబ్బింగ్ సినిమాలు విడుదల చేసిన లక్ష్మి గణపతి ఫిలింస్ సుబ్రమణ్యం తీసుకుని విడుదల చేసారు. మంచి ఓపినింగ్స్ ని రాబట్టిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ రావటం కొంపముంచింది. ఆ తర్వాత మెల్లిగా కలెక్షన్స్ డ్రాప్ అవటం మొదలైంది.

అలాగే సినిమా డబ్బింగ్ రైట్స్ అమ్మేటప్పుడు హీరో స్వయంగా వచ్చి ప్రమోషన్ చేస్తాడని హామీ ఇస్తాడని, తర్వాత ఇలా చేతులు ఎత్తేస్తే చేయగలిగేది ఏముంటుందని అంటున్నారు. మురగదాస్ ప్రతిష్టాత్మకంగా భావించి చేసిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల ఆదరణను బాగానే పొందుతున్నట్లు టాక్. గజనీ సూపర్ హిట్ ప్రేరణతో ఈ చిత్రాన్ని మంచి రేటు ఇచ్చి కొనుగోలు చేసారు. ఇంతకుముందు విక్రమ్ నటించిన నాన్న చిత్రానికి సైతం ఇలాంటి చేదు అనుభవమే నిర్మాతలకు ఎదురైంది. సినిమా ప్లాప్ టాక్ రాగానే విక్రమ్ తాను ఇక ప్రమోషన్ లో పాల్గొనని చెప్పేసాడు. తెలుగులో శక్తి సినిమా టైమ్ లో ఇలియానా ఇక్కడ మెగా నిర్మాత అశ్వనీదత్ కి ప్రమోషన్ కి రాకండా ఇలాంటి ట్విస్టే ఇచ్చింది. సినిమా బాగున్నప్పుడు హీరో వచ్చి ప్రమోట్ చేస్తే మరింత ముందుకెళ్లి కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉంది. అదే ప్లాప్ అయినప్పుడు ఉన్న కలెక్షన్స్ నిలబెట్టుకుని, పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకోవాలనే టెన్షన్ నిర్మాతల్లో ఉంటుంది. ఇటువంటి టైమ్ లో హీరోలు హ్యాండ్ ఇస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్ధితుల్లో పడతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X