అనుష్క కోసం సముద్రంలో హీరో సూర్య ఫైట్
దర్శకుడు హరి మాట్లాడుతూ.. మలేషియా సముద్రంలో చాలా రిస్క్‌తో కూడుకున్న సన్నివేశాలను తెరకెక్కించాం. డూప్‌లను వాడలేదు. సూర్య నటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. సంతానం, వివేక్‌ల హాస్యం ఆకట్టుకుంటుందని చెప్పారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో సూర్య సరసన అనుష్క, హన్సిక ఆడిపాడుతున్నారు.
'సింగం'తో వసూళ్ల వర్షం కురిపించాడు సూర్య. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కొనసాగింపు చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో హన్సిక స్కూల్ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఇటీవలే వాటిని చిత్రించారు. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది. అయితే చిత్రంలో ఆమె పాత్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉంటోందని తెలుస్తోంది. అనుష్క మెయిన్ హీరోయిన్.
హన్సిక మాట్లాడుతూ ''చిన్నప్పుడు తరగతి గదిలో గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి. మళ్లీ యూనిఫామ్ వేసుకొని స్కూల్‌కెళ్లి చదువుకొంటే ఎంత బాగుంటుందో కదూ. స్కూల్ పిల్లలతో కలిసి తరగతిలో కూర్చొంటే భలే తమాషాగా అనిపించింది. పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయ''ని చెప్పింది. ఇంకో విషయమేమిటంటే... హన్సిక నిర్మాతగా మారబోతోందట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు తీయడం నా లక్ష్యం అంటోంది. ''ఎప్పట్నుంచో కంటున్న కల ఇది. తొందరలో సాకారమవుతుంద''ని చెప్పింది.


Click it and Unblock the Notifications












