'మనం' దర్శకుడు కొత్త చిత్రం టైటిల్ లోగో(ఫొటోలు)

By Srikanya

చెన్నై: అక్కినేని కుటుంబంతో 'మనం' చిత్రం చేసి హిట్ కొట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్. విభిన్నమైన కథాంశాలతో చిత్రాలు రూపొందించే ఆయన మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి 24 అనే టైట్టారు. ఆ చిత్రం టైటిల్ లోగోని విడుదల చేసారు. సూర్య హీరోగా రూపొందే ఈ చిత్రంపై ఈ లోగో విడుదలైన నాటి నుంచి అంచనాలు మొదలయ్యాయి. రహమాన్ సంగీతం అందించే ఈ చిత్రానికి కేథరిన్ థెరీస్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

'సింగం', 'సింగం 2' వంటి వరుస హిట్లను అందించిన సూర్య వేగానికి.. 'అంజాన్‌'(సికిందర్) తో కాస్త బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలోని 'మాస్‌' చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. దీని తర్వాత ఆయన విక్రం కె.కుమార్‌, 'అట్టకత్తి' రంజిత్‌, హరి దర్శకత్వంలో నటించనున్నారు. 'మనం' ఫేమ్‌ విక్రంకుమార్‌ చెప్పిన కథ సూర్యకు బాగా నచ్చడంతో తన తదుపరి కాల్షీట్‌ ఆయనకే ఇచ్చినట్లు సమాచారం.

సూర్య నిర్మాణంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానరులో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విక్రంకుమార్‌ '24' అనే శీర్షికను పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్‌, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది. 'సిల్లెను ఒరు కాదల్‌' తర్వాత ఏఆర్‌ రెహ్మాన్‌... సూర్య నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. గతంలో విక్రంకుమార్‌ దర్శకత్వం వహించిన 'కాలై', 'యావరుం నలం' చిత్రాలకు కోలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించింది.

మాస్‌, కమర్షియల్‌ చిత్రాలతో నటుడు సూర్య తెలుగు, తమిళంలో మంచి మార్కెట్‌ను సొంతం చేసుకుంటున్నారు. తన ఇమేజీని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఆయన వెంకట్‌ప్రభు దర్శకత్వంలో 'మాస్‌'లో నటిస్తున్నారు. దీని తర్వాత విక్రంకుమార్‌ దర్శకత్వంలో నటించనున్నారు. 'యావరుం నలం' వంటి హర్రర్‌ చిత్రాన్ని అందించిన విక్రంకుమార్‌.. సూర్యకు కూడా అలాంటి కథనే చెప్పినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Surya’s 24 film title logo released

ఈ సినిమాను సూర్య సొంత బ్యానరైన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. కథ విపరీతంగా నచ్చడంతో.. అందుకు తగిన సంగీత దర్శకుడి వేటలో కూడా పడ్డారు సూర్య. అలా.. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌పై తన ఆశలన్నీ పెట్టుకున్నారట. ఇటీవల రెహ్మాన్‌తో ఈ విషయం చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రెహ్మాన్‌ చాలా బిజీగా ఉన్నారు. పనిభారం కారణంగా ఆయన స్వరాలు సమకూర్చిన 'లింగ' ఆడియో కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. ఆయన కోసం సూర్య కూడా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు ఆఖరులో ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. గతంలో సూర్య నటించిన 'సిల్లెండ్రు ఒరు కాదల్‌'కు రెహ్మాన్‌ స్వరాలు సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X