వాట్...సమంత ఇంత హాటా? (ఫొటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్: ఫ్యామిలీ లుక్ లో కాస్త ఒద్దికగా సమంతను చూసిన వారు ఆమె తాజా చిత్రం లో ఆమె లుక్ ని షాక్ అవుతున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న అంజాన్ చిత్రం స్టిల్స్ ఇప్పుడు తెలుగు,తమిళ భాషల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

"నేను ఇంత వరకు పనిచేసిన వ్యక్తుల్లో ది బెస్ట్ టీమ్ 'అంజాన్' టీమ్. చాలా నైస్ టీమ్. కావాలంటే ఈ విషయంలో ఎవరితోనైనా బెట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చాలా కంఫర్టబుల్‌గా పనిచేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చారు'' అని అంటున్నారు సమంత. సూర్యతో కలిసి ఆమె నటిస్తున్న సినిమా 'అంజాన్'.
శుక్రవారంతో షూటింగ్ పూర్తయిందని సమంత ట్విట్టర్ ద్వారా తెలిపారు.

లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి బ్రదర్స్, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

స్లైడ్ షోలో...చిత్రం స్టిల్స్...

తెలుగు రైట్స్

తెలుగు రైట్స్

ఎవడి గోల వారిదే, స్టైల్, పోటుగాడు వంటి చిత్రాలతో నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత లగడపాటి శ్రీధర్. ఆయన తాజాగా తమిళ చిత్రం అంజాన్ రైట్స్ తీసుకుని వార్తల్లో నిలిచారు. పోటీపడి మరీ ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

తెలుగు టైటిల్

తెలుగు టైటిల్

సమంత, సూర్య కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రేడ్ లో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. లింగు స్వామి దర్శకత్వం లో రెడీ అవుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులో సికిందర్ టైటిల్ తో ఈ చిత్రం విడుదల చేసే అవకాసం ఉంది.

నేపధ్యం

నేపధ్యం

లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రం 'అంజాన్‌'. సమంత హీరోయిన్. ముంబయి నేపథ్యంలో సాగే ఈ కథలోని ఓ ఐటం సాంగులో హిందీ నటి చిత్రాంగద నటిస్తోంది.

కోటి సెట్

కోటి సెట్

'నవ్వే నా స్పెషాలిటీ.. నేను సిల్క్‌స్మిత కమ్యూనిటీ..' అంటూ సాగే ఈ పాటను వివేకా రాశారు. ఇటీవలే ముంబయిలో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకోసం రూ.కోటితో సెట్‌ వేసిందట చిత్ర యూనిట్‌. ఈ ఒక్క పాట కోసం ఆమె రూ.కోటి పారితోషికం తీసుకున్నట్లు కూడా కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ద్విపాత్రాభినయం

ద్విపాత్రాభినయం

రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం.ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

కెమెరా

కెమెరా

ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్‌ డ్రాగన్‌ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ తెలిపారు.

విద్యుత్‌ జమ్వాల్‌

విద్యుత్‌ జమ్వాల్‌

విద్యుత్‌ జమ్వాల్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌, వివేక్‌, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.

రభసకు పోటీ

రభసకు పోటీ

ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్..తాజా చిత్రం రభస రిలీజ్ రోజే విడుదల కి కావటం విశేషం. అలాగే రెండు చిత్రాలలోనూ సమంత హీరోయిన్ .

స్లైలిష్

స్లైలిష్

ఈ సినిమాలో సూర్య సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తారు. అందులోనూ లింగు సామి దర్శకత్వం కావటంతో సినిమా అంటే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతుందని అంటున్నారు.

పిచ్చ గ్లామర్

పిచ్చ గ్లామర్

సమంత చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఇలాంటి గ్లామర్ లుక్ తో ఆమె కనిపించింది లేదు. ఆమె పోస్టర్స్ ఇప్పటికే క్రేజ్‌ను పెంచుతున్నాయి.

హైలెట్స్

హైలెట్స్

యువన్ సంగీతం, రాజీవన్ కళా దర్శకత్వం, సంతోష్ శివన్ కెమెరా పనితనం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

అక్కడ కూడా

అక్కడ కూడా

హిందీలోనూ అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు 75 కోట్లు వ్యయం అందుకే పెడుతున్నట్లు చెప్తున్నారు.

అంచనా

అంచనా

భారీ వ్యయంతో రూపొందిస్తున్న సినిమా ఇది. 150 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం

విడుదల తేదీ

విడుదల తేదీ

ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కావటంతో ఆ రోజుకి ప్రత్యేక కానుకగా చెప్తున్నారు.

రెండు చోట్లా ఒకేసారి..

రెండు చోట్లా ఒకేసారి..

సూర్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా 'అంజాన్'. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో తిరుపతి బ్రదర్స్, యు టీవీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X