సూర్య 'యముడు' సీక్వెల్ విడుదలకు సిద్దం
చెన్నై: సూర్య-అనుష్క జంటగా నటించిన 'సింగం' (తెలుగులో యముడు) ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. 'ఓంగి అడిచ్చా... ఒండ్ర టన్ వెయిట్‌డా..' అంటూ జనంలోనూ ఆవేశాన్ని తెప్పించిన సూర్య ఇప్పుడు 'సింగం-2'గా అలరించనున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తయినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. వచ్చేనెల ఆడియో విడుదల ఉండొచ్చని కోడంబాక్కం సమాచారం. తెలుగులో 'యముడు-2'గా పేరు పెట్టారు. ఇటీవలే హైదరాబాద్‌లో కూడా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాష్ట్రంలోని తూత్తుకుడి, నెల్త్లె, కారైక్కుడి, చెన్నైలో అధికభాగం తెరకెక్కించారు. అంజలి నటించిన పాట కోసం అధికమొత్తం వెచ్చించారు. ఆమెకు రూ.20 లక్షల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.
తూత్తుకుడి సముద్రంలో వరుసగా పదిరోజులపాటు హీరో, విలన్ మధ్య సాగే పోరాట సన్నివేశాలను కెమెరాలో బంధించారు. ఇప్పటికే సినిమా రీమేక్ హక్కులపై బాలీవుడ్ నుంచి భారీ పోటీ నెలకొనడంతో ఎవరికీ విక్రయించక తనవద్దే పెట్టుకున్నాడట నిర్మాత. హిందీలోనూ ఆయనే విడుదల చేసే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సింగంలో అందాలను గుప్పించిన అనుష్క సింగం-2లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. మరింత గ్లామర్‌ను అందించడానికి మరో హీరోయిన్‌గా హన్సిక నటిస్తున్నారు.
సింగం చిత్రానికి సంగీతాన్ని అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ సీక్వెల్‌కు పని చేస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మార్చిలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ మసాలా చిత్రం కోసం తొలిసారిగా విడుదల చేసిన పోస్టర్లు సూర్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో హన్సిక స్కూల్ విద్యార్థినిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. ఇటీవలే వాటిని చిత్రించారు. ఈ ముద్దుగుమ్మ సూర్యతో కలిసి నటించటం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే చిత్రం మెగా హిట్ అవుతోందని ఆమె చెప్తోంది. అయితే చిత్రంలో ఆమె పాత్ర కేవలం పదిహేను నిముషాలు మాత్రమే ఉంటోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











