షాకింగ్: ఆ స్టార్ హీరో దయ్యం పాత్ర చేయడానికి ఒకే...
హైదరాబాద్: దయ్యం పాత్రల్లో ఈ మధ్య ఏ స్టార్ హీరోను అయినా చూసిన సందర్బాలు ఉన్నాయా? సౌతిండియా మొత్తం హవా సాగిస్తున్న పెద్ద హీరోలు....అసలు ఇలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకున్న సందర్భాలే ఈ మధ్య కాలంలో లేవు. కానీ తమిళ హీరో సూర్య మాత్రం ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు.
'బిర్యానీ' ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్యా ఓ సినిమా చేయాడానికి అంగీకరించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఆయన రెండు పాత్రలు పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. నయనతార, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, సూర్య వేసే రెండు పాత్రల్లో ఒకటి దెయ్యం (ఘోస్ట్) పాత్ర అని కోలీవుడ్ సమాచారం.

చెన్నై నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం వెంకట ప్రభు ఈ సినిమాని 3డీ లో తీయనున్నాడని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ 3డీ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. దీనికి సంబదించిన వివరాలను త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. ఈ సినిమాని ఒక కొత్త ఎంటర్టైనర్ గా ఇప్పటి వరకు తమిళ్ లో రాని విదంగా రూపొందించేలా సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











