మెగా సాంగ్ కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు రికార్డు ..!
గ్రూప్ సాంగుల్లో మామూలుగా హీరో హీరోయిన్లు కాకుండా పది, పదిహేను, ఇరవై మంది డ్యాన్సర్లు ఉంటుంటారు. పోనీ కొన్నిసార్లు ఓ వంద మంది ఉండచ్చు. అయితే, ఇప్పుడు ఆ మెగా సాంగ్ కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లు ఓ పాటలో పాల్గొన్నారు. ప్రముఖ నటుడు సూర్య హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న '7 ఎ.ఎం. అరివు' అనే తమిళ సినిమాలో ఈ చోద్యం చోటుచేసుకుంది. వీరిలో 400 మంది డ్యాన్సర్లను సినిమా రంగం నుంచి, మిగతా వారిని వివిధ డ్యాన్స్ స్కూళ్ల నుంచి తీసుకున్నారు. హరీష్ కంపోసిషన్ లో ఈ పాటలో కొంత భాగాన్ని ఇటీవల చెన్నయ్ లోని బిజీ ఏరియా అయిన రంగనాథన్ స్ట్రీట్ లో షూట్ చేశారు. ఇంత మంది డ్యాన్సర్లు ఒక పాటలో పాల్గొనడం ఒక రికార్డే..!ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయుటకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయుటకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











