twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలసుబ్రమణ్యంకు సుశీల అవార్డుతో సత్కారం

    By Srikanya
    |

    ప్రముఖ గాయకుడు పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ను మరో అద్బుతమైన అవార్డు వరించింది. ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల తన పేరిట ఏర్పాటు చేసిన అవార్డును పద్మశ్రీ ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఆదివారం చెన్నయ్‌లో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇది తనకు లభించిన అత్యంత అరుదైన అదృష్టమని,సుశీలమ్మ పేరిట పురస్కారం పొందే అర్హత అసలు తనకింకా రాలేదని వినమ్రంగా కృతజ్ఞతలు చెప్పారు.

    బాలూను ఘనంగా సత్కరించి న అనంతరం కళారంగానికి ఆయన చేసిన సేవలను ప్ర శంసిస్తూ వారు ప్రసంగించారు. అవార్డు ప్రదానం ముగిసిన తర్వాత యు.కె.మురళి సారథ్యంలో గాయకులు వివిధ భాషల మధుర గీతాలను ఆలపించి ఆహూతులకు వీనులవిందు చేశారు. ఉమామురళి, జ్వాలాదీపక్‌ల నృత్య ప్రదర్శన అందర్నీ అలరించింది. ఈ కార్యక్రమం ద్వారా అందిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల సహాయార్థం అందజేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

    ఇక ఈ అవార్డు ప్రదానోత్సవానికి ప్రముఖనటి సుహాసిని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్‌.విశ్వనాథన్‌, గాయకులు పి.బి.శ్రీనివాస్‌, టి.ఎం.సౌందరరాజ న్‌, మనోలతోపాటు గాయనీమణులు పి.సుశీల, ఎస్‌.జానకి, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి, వాణీ జయరాం, ఎస్‌.పి.శైలజ తదితరులు పాల్గొన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X