»   » స్వామీజీతో గడిపిన ఆ నటీమణి ఎవరు?

స్వామీజీతో గడిపిన ఆ నటీమణి ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిత్యానంద స్వామీజీకి..'స్వర్గం' చూపించిన నటీమణి పేరు ఆంగ్ల అక్షరం 'ఆర్'తో ప్రారంభం అవుతుందని, ప్రస్తుతం ఆమె తమిళంలో ప్రముఖ హీరోయిన్ అని ప్రముఖ సన్ చానల్ ఓ వీడియో ప్రసారం చేసింది. ఆ వీడియోలో ఆ స్వామిజీ,నటీమణితో కలిసి 'చల్లని' బీరు సేవిస్తూ రాసలీలల్లో మునిగిపోయి ఉన్నారు. ఈ వీడియోను తెలుగు ఛానెల్ సైతం ప్రసారం చేసింది. దాంతో ఇప్పుడు తమళ చిత్రం పరిశ్రమలో అదో హాట్ టాపిక్ గా మారింది. ఏదో క్విజ్ పోగ్రామ్ లో పాల్గొన్నట్లుగా అంతా ఎవరా నటి అని అంచనాలు వేస్తున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన ఈ స్వామీజీ శృంగార లీలలను సన్ టీవీ చానల్ నిన్న బయటపెట్టింది. అయితే ఆ నటీమణి రాగసుధ కానీ,రంజిత కానీ అయ్యుండే అవకాశం ఉందని తమిళ మీడియా అంచనాలు వేస్తోంది.

ఇక ఆ ప్రసారం అయిన వీడియోలో.. దృశ్యాలు చూస్తుంటే స్వామీజీకి, నటికి చాలాకాలంగా పరిచయమున్నట్లు అర్థమవుతోంది. టీవీలో ప్రసారం చేసిన దృశ్యాల ప్రకారం..నిత్యానందస్వామి టీవీలో ఆంగ్ల పాటలను తిలకిస్తుండగా నటీమణి చీరకట్టులో, చిరునవ్వుతో స్వామీజీకి దగ్గరైంది. 'ప్రత్యేక సేవ' అనంతరం స్వామీజీని చుంబనాలతో తడిపేసింది. మళ్లీ చుడీదార్‌లో వచ్చి స్వామీజీకి 'ఏదో' మాత్ర అందించింది. ఆ తర్వాత స్వామీజీ రెచ్చిపోవడం కనిపించింది. 'లీల'ల సమయంలో గదిలో లైటు ఆర్పడానికి స్వామీజీ ప్రయత్నిస్తుండగా, ఆ నటీమణి ఆయన ప్రయత్నాన్ని అడ్డుకోవడం స్పష్టంగా కనిపించింది.

భగవద్గీత ప్రవచనాలతో పాపులర్ అయిన ఆయన్ని అందరూ ఇప్పుడు తిట్టి పోస్తున్నారు. ఇక మరి కొంత మంది సినిమా వారితో ఆయన నడిపిన శృంగార లీలలు కూడా ఆ ఛానెల్ వద్ద ఉన్నాయంటూ మరో రూమర్ బయిలు దేరింది. దాంతో ఇంకెవరు ఆ లిస్టులో ఉన్నారు. మరో ప్రక్క పరిశ్రమలో ఉన్న ఆయన భక్తులు అటూ ఇటూ మాట్లాడలేకపోతున్నారు. ఇదిలా ఉంటే నిత్యానంద స్వామి చల్లని చూపు కోసం తెలుగు పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు,హీరోలు రెగ్యులర్ గా ఆయన సమావేశాలకు అటెండ్ అవుతూంటారని ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల పేర్లతో వినపడుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu