విక్రమ్ తో 'కలర్స్' స్వాతి?
'మా' టీవీలో కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన స్వాతి, కృష్ణవంశీ దర్శకత్వంతో వచ్చిన 'డేంజర్' చిత్రం ద్వారా కథానాయిగా పరిచయమయింది. అటుపై 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో పూజగా వెంకటేష్ వెంట పడే అమ్మాయిగా నటించి మెప్పించింది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న స్వాతికి కోలీవుడ్ నుండీ పిలుపు వచ్చింది. తమిళ నటుడు 'జై' సరసన 'సుబ్రమణ్యపురం' చిత్రంలో నటించి తన హావభావాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు లో కూడా 'అనంతపురం 1980' పేరుతో డబ్ అయింది.
తెలుగులో ఆమె 'మహి మహి' అంటూ అల్లరి చేసిన 'అష్టాచెమ్మా' చిత్రం చిన్న సినిమాగా విడుదలయి పెద్ద విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఇటీవలే విడుదలయిన 'కలవరమాయే మదిలో' చిత్రంలో కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక పై మంచి స్క్రిప్ట్ వస్తేనే సినిమాలు చేస్తానన్న స్వాతి కలనిజమవబోతోంది. విశ్వసనీయ కథనం ప్రకారం స్వాతి 'చియాన్' విక్రమ్ సరసన ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. దీనికి 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', '7/g బృందావన కాలనీ' లాంటి హిట్ సినిమాల దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కాకుండా 'సుబ్రమణ్యపురం' ఫేం 'జై' సరసన కూడా ఓ చిత్రంలో నటించబోతోంది.


Click it and Unblock the Notifications











