For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'మల్లన్న'కూ స్వైన్ ఫ్లూ

  By Staff
  |

  Mallanna
  స్వైన్ ఫ్లూ ప్రభావం సినీ పరిశ్రమపై సైతం తీవ్ర స్ధాయిలో ప్రభావం చూపుతోంది. తాజాగా మల్లన్న సినిమా ఆడియో పంక్షన్ కీ సైతం ఈ స్వైన్ ఫ్లూ కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. 'మల్లన్న' చిత్రం షూటింగ్ లో ఎక్కువ భాగం విదేశాల్లో జరపడంతో పాటు కీలకమైన సాంగ్స్ కూడా అక్కడే భారీ ఎత్తున చిత్రీకరించారు. విక్రమ్,శ్రియపై చిత్రీకరించిన ఓ పాటలో 50 మంది మెక్సికన్ డాన్సర్లు నర్తించారు. ఎంత వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ ఆడియో కార్యక్రమానికి ఆ డాన్సర్లందరినీ చెన్నైరప్పించి స్టేజ్ పై ప్రదర్శన ఇప్పించాలని కొద్దికాలంగా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ స్వైన్ ఫ్లూ జాడలు మెక్సికోలో కనిపించడంతో ఫారిన్ ఎంబసీలు వీసాల జారీ ప్రక్రియను స్లో చేశాయి. దీంతో తమ సినిమాలు విదేశాల్లో షూటింగ్ జరపాలనుకుంటున్న దర్శకులతో పాటు, వివిధ పనుల నిమిత్తం ఇండియాకి రావాలనుకుంటున్న విదేశీయులకు కూడా సమస్యగా మారింది. మెక్సికన్ డానర్లను 'మల్లన్న' ఆడియోకి రప్పించే అవకాశాలకు గండిపడింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను కలైపులి ధాను అన్వేషిస్తున్నారు.

  మెక్సికన్ డాన్లర్లకు బదులుగా సినిమాలోని మరో పాటలో నర్తించిన ఇటాలియన్ డాన్సర్ల కోసం ప్రయత్నిస్తున్నామనీ, ఇంతవరకూ జరిగిన అన్ని ఆడియో ఫంక్షన్లకు తలదన్నేలా ఈ ఫంక్షన్ ఉంటుందనీ ఆయన చెబుతున్నారు. ఈ ఫంక్షన్ కు అయ్యే ఖర్చు ఓ చిన్న సినిమా బడ్జెట్ తో సమానమని విశ్లేషకుల అంచనా.ఏడాదిన్నరకు పైగా నిర్మాణం జరుపుకొన్నఈ చిత్రం వచ్చే జూన్ లో విడుదలకు సిద్ధమవుతోంది. సుశీ గణేషన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కలైపులి ధాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం (కందస్వామి) ఆడియోను ఈనెల 17న చెన్నైలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

  విక్రమ్ మల్లన్న(కందసామి) చిత్రంపైనే ఇప్పుడందరి దృష్టి ఉంది. అందులోనూ చాలా కాలం విక్రమ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమాలో విక్రమ్ రకరకాల గెటప్ లలో కనపడనున్నారు. ఇక సుశీగణేషన్ దర్శకత్వంలో కలై పులి థాను నిర్మిస్తున్న ఈ చిత్ర కథ కూడా ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విక్రమ్ పాత్ర అందరినీ ఆదుకునే రాభిన్ హుడ్ తరహాలో వెళ్తుందని తెలుస్తోంది. అలాగే కథ ప్రకారం జనం తమ కష్టాలని, భాధలని చీటీలపై రాసి ఓ ప్రముఖ దేవాలయం వద్ద నున్న మర్రిచెట్టుకి వేళ్ళాడ తీస్తారుట.

  వాటిని చదివే విక్రమ్ తన దైన శైలిలో పరిష్కరస్తూ వారి దృష్టిలో దేవుడిలా ఎదుగుతాడుట. వారంతా దైవం మల్లన్నే ఈ పనులన్నీ చేసాడని భావిస్తూంటారుట. ఇక ఈ సినిమా పూర్తి హాలివుడ్ స్టైల్స్ తో నిండి ఉంటుందిట. అంతేగాక ఈ చిత్రంలో విక్రమ్ లేడీ గెటప్ లో కూడా కనపడి కనువిందు చేయనున్నాడు. ఇక శ్రియ అతన్నిమొదట అడ్డుకున్న తర్వాత అతనికి సహరిస్తూ గ్లామర్ కురిపిస్తూంటుందిట. అంటే 'అపరిచితుడు' లో ఇంటర్ నెట్ కు బదులు ఇక్కడ మర్రిచెట్టు వస్తుందన్నమాట. ఇక ఈ సినిమా గురించి విక్రమ్ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆయన చెప్పే దాని ప్రకారం హాలీవుడ్ తరహాలో ఇండియన్ జేమ్స్ బాండ్ లా మల్లన్న కనపడతాడుట.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X