Don't Miss!
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
స్టార్ హీరోయిన్‌తో నయనతార మాజీ ప్రియుడు పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో తండ్రి!
కోలీవుడ్ ప్లే బాయ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు శింబు. తమిళ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా ప్లే బాయ్ అనే ట్యాగ్ మాత్రం ఈ హీరోగారికే సెట్టవుతుంది. శింబు లవ్ స్టోరీల గురించి సౌత్ ఆడియెన్స్ మొత్తానికి తెలుసు. స్టార్ హీరోయిన్స్ తో ఎఫైర్ అంటూ రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే ఫైనల్ గా ఈ యువ సీనియర్ మోస్ట్ బ్యాచిలర్ పెళ్లికి సిద్ధమయ్యాడు అనే రూమర్స్ రాగా.. ఆ విషయంపై అతని తండ్రి వివరణ ఇచ్చారు.
కెరీర్ మొదటి నుంచి..
శింబు కెరీర్ మొదటి నుంచి స్టార్ హీరోయిన్స్ తో ఎఫైర్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత నయనతారతో ఈ స్టార్ యాక్టర్ చాలా రోజుల పాటు ప్రేమలో మునిగి తేలాడు. వెండితెరపై వాళ్ళు కనిపిస్తే అప్పట్లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ క్రియేట్ అయ్యేది. కొన్నాళ్లకు ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని కొత్త లవ్ స్టోరీలను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆ హీరోయిన్ కూడా..
హన్సికతో కూడా శింబు కొన్నాళ్లపాటు డేటింగ్ లో ఉన్నాడనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ లవ్ స్టోరీ కూడా ఎక్కువ కాలం నడవలేదు. ఇక ఆ తరువాత చాలా మంది పేర్లు వినిపించినప్పటికి శింబు కొత్త లవ్ స్టోరీలను బయటకి రానివ్వకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. చాలా వరకు శింబు ఈ మధ్య కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటున్నాడు.
పెళ్లిపై రూమర్స్..
ఇక చాలా రోజుల తరువాత శింబు పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. ఒక స్టార్ నటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు రాగా శింబు తండ్రి రాజేందర్ స్పందించాడు. రాజేందర్ సీనియర్ నటుడిగా తమిళ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇకపోతే ఇటీవల తన కొడుకు పెళ్లిపై వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని కుండ బద్దలు కొట్టారు.
సంబంధాలు చూస్తున్నా..
ఇంకా శింబు పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతనికి సరిపడే అమ్మాయి కోసమైతే చూస్తున్నాం. ఇద్దరు జాతకాలు కలిసి అమ్మాయి నచ్చితే వెంటనే పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను కూడా నమ్మవద్దు. పెళ్లి విషయాన్ని మేమే అధికారంగా చెబుతామని శింబు తండ్రి రాజేందర్ వివరణ ఇచ్చాడు.