T Rajendar కు తీవ్ర అస్వస్థత.. సింగపూర్‌కు తరలించేందుకు శింబు ప్రయత్నాలు?

తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత టీ రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

అయితే మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. రాజేందర్‌ను సింగపూర్‌కు తీసుకెళ్లి అత్యాధునిక చికిత్స అందించాలని హీరో, రాజేందర్ తనయుడు శింబు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

T Rajendar hospitalised due to Ill health at Chennais Ramachandra Hospital

ఇక టీ రాజేందర్ విషయానికి వస్తే.. బహుముఖ ప్రతిభావంతుడు. నటుడిగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా, డైరెక్టర్‌గా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా సినిమా పరిశ్రమలో సుపరిచితులు. అంతేకాకుండా అతను గొప్ప వక్త కూడా. గుక్క తిప్పుకోకుండా సామెతలు మాట్లాడటంలో నిష్ణాతులు.

ఒరు తాళై రాగమ్, వసంత అజైపుగల్, రైల్ పయనంగల్లి, నేంజి ఓరు రాగమ్, సత్తం సిరికిరదు, రాగం తానం పల్లవి, తంగక్కోర్ గీతమ్, ఉయిరుల్లవరై ఉషా, మైథిలి నా ప్రేయసి లాంటి చిత్రాలను రచించి, దర్శకత్వం వహించారు. నటుడిగా తన ప్రతిభను చాటుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X