ఇష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి.. మా అబ్బాయితో నటించిన హీరోయిన్లు వద్దు!

గత కొన్ని వారాలుగా తమిళ స్టార్ హీరో శింబు సోదరుడు కురలరాసన్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇతగాడి ప్రేమ వ్యవహారం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో కురలరాసన్ వివాహం ఓ ముస్లిం యువతితో జరగబోతోంది. చాలా కాలంగా కురలరాసన్ ఆ ముస్లిం యువతితో ప్రేమలో ఉన్నాడు. ఏప్రిల్ 26న కురలరాసన్ వివాహం జరగనున్న నేపథ్యంలో శింబు తండ్రి టి రాజేందర్ తమిళనాడులోని ప్రముఖుల్ని వివాహానికి ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా రాజేందర్ శింబు వివాహం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ముస్లిం యువతితో

ముస్లిం యువతితో

శింబు తమ్ముడు కురలరాసన్ తాను ప్రేమించిన ముస్లిం యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వివాహానికి పెద్దలు అంగీకరించ ముందు పెద్ద తతంగమే జరిగింది. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని కురలరాసన్ కు ఆమె కుటుంబ సభ్యులు కండిషన్ పెట్టారు. అనేక చర్చల తర్వాత కురలరాసన్ ఇస్లాం లోకి మారేందుకు అంగీకరించాడు. ఇటీవలే కురలరాసన్ ఇస్లాం మతాన్ని స్వీకరించారు. దీనితో అతడి ప్రియురాలి కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు.

స్టాలిన్‌ని ఆహ్వానించి

స్టాలిన్‌ని ఆహ్వానించి

ఏప్రిల్ 26న కురలరాసన్ వివాహం జరగబోతోంది. దీనితో రాజేందర్ డీఎంకే చీఫ్ స్టాలిన్ ని వ్యక్తిగతంగా కలసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. స్టాలిన్ ని కలసిన తర్వాత రాజేందర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శింబు వివాహాం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శింబుకి నచ్చిన యువతి దొరికిన వెంటనే పెళ్లి జరుగుతుందని రాజేందర్ వ్యాఖ్యానించారు.

హీరోయిన్లు వద్దు

హీరోయిన్లు వద్దు

శింబుకి తగిలిన పాత గాయాలు గుర్తొచ్చినట్లు ఉన్నాయి.. అందుకే శింబు వివాహం గురించి మాట్లాడుతూ రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. త్వరలోనే శింబుకి నచ్చిన అమ్మాయి దొరుకుతుందని ఆశిస్తున్నాయి. శింబుకి నచ్చిన అమ్మాయితోనే అతడి వివాహం జరుగుతుంది. కానీ అతడితో నటించిన హీరోయిన్లు మాత్రం వద్దు అంటూ రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లవ్ ఫెయిల్యూర్

లవ్ ఫెయిల్యూర్

గతంలో నయనతార, హన్సికలతో శింబు ఘాడమైన ప్రేమలో మునిగి తేలాడు. నయనతారతో పెళ్లి పీటల వరకు వచ్చిన వ్యవహారం ఆగిపోయింది. నయన్ నుంచి శింబు విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శింబు ఆపిల్ బ్యూటీ హన్సిక ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి వివాహానికి పెద్దలు కూడా అంగీకరించారు అనే వార్తలు వచ్చాయి. కానీ సడెన్ గా వీరిద్దరి ప్రేమ కూడా బ్రేకప్ అయింది. ఇటీవల శింబుని ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. నేను ప్రేమలో పడితే ఆ విషయం తమిళనాడు మొత్తానికి తెలుస్తుందని శింబు వ్యాఖ్యానించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X