twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ తమిళుడే కాదు.. ఆయన ఏం వెలుగపెడుతారు.. అంత సీన్ లేదు.. రాజేందర్

    రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తల నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు శింబు తండ్రి టీ రాజేందర్ విరుచుకుపడ్డారు. రజనీ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడటమంటే రిలీజ్ కాని సిన

    By Rajababu
    |

    రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వార్తల నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు శింబు తండ్రి టీ రాజేందర్ విరుచుకుపడ్డారు. రజనీ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడటమంటే రిలీజ్ కాని సినిమా గురించి మాట్లాడినట్టే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. సినిమా పరిశ్రమకు చేటుకలిగిస్తున్న జీఎస్టీ బిల్లు అమలుపై ప్రశ్నించలేకపోయిన రజనీ రాజకీయాల్లోకి వచ్చి ఏం ఉద్దరిస్తారని ప్రశ్నించారు.

    రాజకీయాలపై పట్టులేదు

    రాజకీయాలపై పట్టులేదు

    రజనీ పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతూ.. రాజకీయాల గురించి తొలుత ఆయన ప్రకటన చేసిన తర్వాత చూద్దాం. మీడియాలో తప్ప రాజకీయాలపై రజనీకి పట్టులేదు అని రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ధైర్యం లేదు. ఆయనకు అంత సీన్ లేదు అని రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    సినీ పరిశ్రమ సర్వనాశనం

    సినీ పరిశ్రమ సర్వనాశనం

    జీఎస్టీ వల్ల సినీ పరిశ్రమ సర్వనాశనం అయిపోతుంది. తనకు అన్నీ ఇచ్చిన సినీ పరిశ్రమ గురించి ఆయన అస్సలు ఆలోచించడం లేదు అని రాజేందర్ ఆరోపించారు. పరిశ్రమకు మేలు చేయాలనే ఉద్దేశం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏం వెలగపెడతారు. ఇప్పటికైనా ఆయన జీఎస్టీపై పెదవి విప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.

    పెత్తనం చెలాయించే హక్కులేదు

    పెత్తనం చెలాయించే హక్కులేదు

    రజనీ అసలు తమిళుడే కాదు, అలాంటి వ్యక్తికి తమిళ ప్రజలపై పెత్తనం చలాయించే హక్కు లేదు రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజేందర్ గతంలోనూ రజనీపై ఇలాగే తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. జీఎస్టీ బిల్లు నేటి నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

    జీఎస్టీతో టీవీ ఇండస్ట్రీపై పెను ప్రభావం

    జీఎస్టీతో టీవీ ఇండస్ట్రీపై పెను ప్రభావం

    ఇదిలా ఉండగా, జీఎస్టీ అమలుతో బుల్లితెర సీరియళ్లపై భారీగా పన్ను ప్రభావం టీవీ ఇండస్ట్రీపై కూడా పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. టీవీ నటుల పారితోషికాలపై పన్నుభారం భారీగానే పడనున్నది. టీవీ యాక్టర్ల పారితోషికం లేదా ప్రొడక్షన్ కాస్ట్‌పై ఏ మేరకు ప్రభావం చూపనుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.

    నెల తర్వాతే అసలు సంగతి..

    నెల తర్వాతే అసలు సంగతి..

    అయితే జీఎస్టీ పన్ను ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఒక నెల రోజుల తర్వాతే స్పష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ట్యాక్స్ కన్సల్టెంట్స్ అంచనా ప్రకారం ప్రొడక్షన్ కాస్ట్, నటీనటుల పారితోషికాలపై జీఎస్టీ ప్రభావం వెంటనే అంచనా వేయడం కష్టం. ఒక నెల తర్వాత తెలుస్తుంది. జీఎస్టీతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిన పక్షంలో ఆ భారం టీవీ నటులపై పడే అవకాశం ఉంది.

    English summary
    Tamil Superstar Rajinikanth gets unexpected shocker with GST which was made forcibly rolled down by the central government from July 1. South film industry's people became panic with the implementation of high tax rates. Hero Simbu's father and noted filmmaker T Rajender breathed fire on Rajinikanth on this issue. T Rajender appealed Rajini to get reacted on the burning issue. "He hasn't done any favour to industry then how can he do favour to people entering politics?" questioned T Rajender.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X