శింబు పెళ్లి కోసం అథివరధర్ సహాయం కోరిన టి రాజేందర్

తమిళ స్టార్ శింబు తన సినిమాలకు సంబంధించిన వార్తలకంటే వివాదాలు, ప్రేమ, పెళ్లి గురించిన వార్తలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. గతవారం శింబుకు సంబంధించిన ఓ విషయం పెద్దకాంట్రవర్సీ అయింది. నిర్మాత సురేష్ కామాచ్చి వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా 'మానాడు' అనే సినిమా చేయాలనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించి సంవత్సరం అయినా శింబు డేట్స్ ఇవ్వకపోవడంతో అతడిని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ వివాదం సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం శింబు తన ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే శింబు తండ్రి టి రాజేందర్ తమిళనాడులోనే ఉన్నారు. ఇటీవల ఆయన కాంచీపురంలోని అథివరధర్ ఆలయాన్ని సందర్శించారు.

T Rajendhar visited the Athivaradhar temple

ఈ సందర్భంగా టి రాజేందర్ మీడియా వారితో మాట్లాడుతూ... తన కుమారుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారని తెలిపారు. శింబు పెళ్లి త్వరగా జరుగాలని, అతడికి సూటయ్యే అమ్మాయి, అతడు మెచ్చే అమ్మాయి దొరరాలని ప్రార్థించినట్లు తెలిపారు. త్వరలోనే తన ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

హాలిడే పూర్తి చేసుకుని శింబు ఇండియా తిరిగి వచ్చిన తర్వాత 'మానాడు' వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. ఈ విషయాన్ని తాను అంత ఈజీగా వదలనని ఆగ్రహంగా ఉన్నారట శింబు. ప్రస్తుతం శింబు 'మఫ్టి' అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గీతమ్ కార్తీక్ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా స్టూడియో గ్రీన్ వారు నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X