హన్సిక లవ్ మ్యాటర్ పై శింబు తండ్రి సీరియస్...

By Srikanya

చెన్నై : ఈ మధ్య మా అబ్బాయి ఓ అమ్మాయి ప్రేమలో పడ్డారనే వార్తలు వచ్చాయి. దానిపై నాకు బాగా పరిచయమున్న పాత్రికేయుడు అభిప్రాయాన్ని అడిగారు. 'మా అబ్బాయి ప్రేమిస్తే మాతో చెబుతాడు. అలా చెబితే.. ఏ అమ్మాయి అయినా నేను పెళ్లి చేసి పెడతా'నని చెప్పాను. ఏ హీరోయిన్‌ పేరూ ప్రస్తావించలేదు. అయితే ఆ అమ్మాయి(హన్సిక)ని శింబు ప్రేమించినట్లయితే పెళ్లిచేసి పెడతానంటూ ప్రతికలో రాశారు. వాస్తవానికి నేనొకటి చెప్పా. వారొకటి రాశారు అంటూ శింబు తండ్రి టి.రాజేంద్ర సీరియస్ అయ్యారు.

ఒంటరిపోరాటంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సకలకళావల్లభుడు టి.రాజేందర్‌. దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, మాటలు, కథ, సంగీతం, నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌.. ఇలా అన్ని శాఖల్లోనూ అనుభవం ఉంది. స్వీయ దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తేనాండాల్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై రామనాథన్‌ తెరకెక్కిస్తున్న 'ఆర్య సూర్య'లో ప్రత్యేక గీతంలో నటించాడు. టి.రాజేందర్‌ సరసన ముమైత్‌ఖాన్‌ చిందులేసింది. ఈ సినిమా పాటలను ఇటీవల విడుదల చేశారు. కేఎస్‌ రవికుమార్‌, దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్‌, పి.వాసు, సి.కల్యాణ్‌, కాట్రగడ్డప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా టి.రాజేందర్‌ మాట్లాడుతూ.. అంచెలంచెలుగా సినీ పరిశ్రమలో ఎదిగాను. ఎవరినీ అనుకరించలేదు. సాయం కోసం ఎవరివద్దా ప్రాధేయపడలేదు. నా ప్రతిభతో నేను ఈ స్థాయికి చేరాను. నేను అందగాణ్ని కాదు. నా కొడుకు 'మన్మథుడు'. ఇప్పటికీ నాకు తమిళంలో మాత్రమే కాక తెలుగులోనూ అభిమానులున్నారు. అందుకే అక్కడ నేరు తెలుగు చిత్రంలో నటిస్తున్నాను. . ప్రతిభ ఉంటే జీవితాంతం ఎవరిపైనా ఆధారపడకుండా జీవించగలం అనే నమ్మకం నాకుంది. ఆ విషయంలో నాకు నేనే స్ఫూర్తిదాయకమని చెప్పారు.

ఇక రీసెంట్ గా శింబు , హన్సిక ఒకరినొకరు ప్రేమించుకుంటునట్టు అధికారికంగా తెలిపారు. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరి నటులమధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తుందని, అది త్వరలో వివాహానికి దారితీస్తుందని పలు వార్తాపత్రికలు వెల్లడించాయి. వారిగురించి వస్తున్న వార్తలకు విసిగిపోయిన ఈ తారలు అధికారికంగా మేము ప్రేమలో ఉన్నామని, మరెటువంటి పుకార్లను పుట్టించకండి అని తెలిపారు

'అవును... మేం ప్రేమలో ఉన్నాం' అంటూ మొత్తానికి తన లవ్ ఎఫైర్ ని రివిల్ చేసేసింది హన్సిక. తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామనే మాటను కుండబద్ధలు కొట్టింది శింబు-హన్సిక జంట. హన్సికను ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని నటుడు శింబు ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ఆ వెంటనే శింబు కూడా 'అవును... నేను హన్సికతోనే ఉంటున్నా. అయితే మా పెళ్లిని మాత్రం పెద్దలు నిర్ణయిస్తారు. అంతవరకు మా వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలిగొంచొద్దు' అంటూ ట్వీట్‌ చేశాడు.

హీరోయిన్ హన్సిక గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తమిళ హీరో శింబుతో అమ్మడు కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. చాటుమాటుగా సాగుతున్న వీరి ప్రేమ వ్యవహారం గురించి తమిళ పత్రికలు కోడైకూస్తున్నాయి. హన్సిక మాత్రం 'మా మధ్య అలాంటి బంధమేదీ లేద'ని చెబుతూ వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X