తాప్సీని భయపెట్టిన అభిమాని
తాప్సీ కి రీసెంట్ గా 'వందాన్ వెండ్రాన్"అనే తమిళ సినిమా షూటింగ్ లో ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.ఆ విషయాన్ని ఆమె మీడియాకు చెప్తూ..ఆ మధ్య తమిళ చిత్రం 'వందాన్ వెండ్రాన్" షూటింగ్ లొకేషన్‌లో ఓ వ్యక్తి నన్ను చాలా కంగారుపెట్టాడు.ఓ రకంగా చెప్పాలంటే బాగా భయపెట్టాడు.షూటింగ్ చూడటానికి వచ్చిన వ్యక్తి అతను. ఒక రోజంతా నన్ను అలా కంటిన్యూగా చూస్తూనే ఉన్నాడు. నేను ఎటు తిరిగితే ఆటు వైపు అతను ఉండేవాడు. నేనతన్ని చూడగానే చూపులు తిప్పుకునేవాడు.మళ్లీ షరా మామూలే. దాంతో బాగా భయం వేసింది. చివరికి చిత్రదర్శకుడు కన్నన్ దగ్గర ఈ విషయం చెప్పాను. వెంటనే ఆయన అతని దగ్గరకెళ్లి 'ఏం కావాలి అన్నయ్యా" అని అడుగు అన్నారు. అలాగే చేశాను. అంతే... అతను అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యాడు అంది.అయితే ఆ తర్వాత అతను ఆమెకు వీరాభిమాని అని తెలిసిందిట.ఇక ఆ తర్వాత ఆమె అతను ఎక్కడన్నా కనిపిస్తాడేమో అని ఎదురుచూసిందిట.ఈ విషయాన్ని గుర్తు చేసుకుని అప్పుడప్పుడూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయంది.


Click it and Unblock the Notifications











