'అల..వైకుంఠపురములో' తమిళ్ రీమేక్.. టాలెంటెడ్ హీరో స్పెషల్ ప్లాన్?

అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం 'అల.. వైకుంఠపురములో..' అలాగే త్రివిక్రమ్ కెరీర్ ని కూడా మరొక లెవెల్ కి తీసుకెళ్లిన ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 200కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఈ కమర్షియల్ మూవీ సక్సెస్ కావడానికి హీరో దర్శకుడి క్రేజ్ తో పాటు థమన్ ఇచ్చిన సంగీతం కూడా బాగానే ఉపయోగపడింది.

Recommended Video

Ala Vaikunthapuramlo Tamil Remake By Shiva Karthikeyan
 రీమేక్ చేయాలని..

రీమేక్ చేయాలని..

ఇంతలా రికార్డులు క్రియేట్ చేసిన సినిమాను రీమేక్ చేయడానికి పరభాషా హీరోలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో కొందరు నిర్మాతలు ఆ పనుల్లో బిజీ అయ్యారు. కన్నడలో డైరెక్ట్ తెలుగు సినిమానే సక్సెస్ అయ్యింది కాబట్టి అక్కడ రీమేక్ చేసే ఆలోచన లేదు. ఇక మలయాళంలో అనువాదమైన ఈ సినిమా అక్కడ కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.

కోలీవుడ్ ప్లానింగ్..

కోలీవుడ్ ప్లానింగ్..

ఇక సౌత్ నుంచి తమిళ్ లో మాత్రమే ఈ సినిమాను రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అల.. కథను ఇప్పటికే చాలా మంది హీరోలు చూశారు. కొందరు మంచి టీమ్ సెట్టయితే గాని చేయమని చెబుతున్నారు. కానీ శివ కార్తికేయన్ అందరికంటే జెట్ స్పీడ్ లో బన్నీ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 అల.. అక్కడ హిట్టవ్వాలంటే..

అల.. అక్కడ హిట్టవ్వాలంటే..

అల..వైకుంఠపురములో సినిమా తెలుగులో సక్సెస్ కావడానికి మెయిన్ గా త్రివిక్రమ్ మేకింగ్ ఆఫ్ స్టైల్ చాలా ఉపయోగపడింది. అలాగే బన్నీ స్టైల్ తో పాటు కథకు తగ్గట్టు పాత్రలో కొత్త షేడ్స్ ని చూపించడం సినిమాకు ప్లస్ అయ్యింది. అన్నిటికంటే ఎక్కువగా థమన్ సంగీతం సినిమాకి మరో మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. అందుకే తమిళ్ లో హిట్టవ్వాలంటే కూడా ఈ సినిమాను మంచి టీమ్ తో సినిమాను తెరకెక్కించాలి.

 త్రివిక్రమ్ సినిమా అట్టర్ ప్లాప్..

త్రివిక్రమ్ సినిమా అట్టర్ ప్లాప్..

త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమాను తమిళ్ లో శింబు రీమేక్ చేయగా అక్కడ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మేకింగ్ ఆఫ్ స్టైల్ అనేది సినిమా హిట్టవ్వడానికి అసలు కారణమని చెప్పవచ్చు. ఇక శివ కార్తికేయ కూడా తమిళ్ లో మంచి దర్శకుడిని సెలెక్ట్ చేసుకొని సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి అతని ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X