Just In
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్: కరోనాపై భారత్‌దే పైచేయి, మోడీ సర్కారు సక్సెస్, లాక్డౌన్ ఎఫెక్ట్, వ్యాక్సిన్‌కే మొగ్గు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో బంపర్ ఆఫర్ ను సోంతం చేసుకున్న మిల్క్ బ్యూటీ..!
ప్రస్తుతం తెలుగునాట ఎవరిమాట విన్నా తమన్నా. హ్యాపీడేస్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్దానాన్ని ఏర్పరచుకున్నారు. దానితో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మిల్క్ బ్యూటీ తమన్నా అందరి మనసుల్లో గుర్తుండి పోయింది. ప్రస్తుతం తమిళనాట వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న భామ అవకాశాలను చేజిక్కించుకోవడంలో కూడా మిగతా హీరోయిన్ల కంటే నాలుగడుగులు ముందే ఉంటోంది. ప్రస్తుతం తమన్నా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వివి వినాయక్ దర్శకుడిగా అల్లు అర్జున్ తో "బద్రీనాథ్" చిత్రంలో మరియు అదే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్యతో ఒక సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం "బద్రీనాథ్" షూటింగ్ కులుమనాలిలో జరుగుతుంది. కులుమనాలిలో ఒక భారీ సన్నివేశాలనుతో పాటు ఒక ప్రత్యేకమైన వేసిన సెట్లో పైట్లను చిత్రికరిస్తున్నట్లు వెల్లడించారు. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాలలో కూడా తమన్నా నటిస్తోంది.
తాజాగా మరో గొప్ప ఆఫర్ తమన్నాను వరించింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "త్రీ ఇడియట్స్" చిత్రం తమిళ్ వెర్షన్ లో హీరోయిన్ గా తమన్నా ఎంపికైంది. తమిళంలో టాప్ రేస్ లో ఉన్న నయనతార ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారంతో, అసిన్ శ్రీలంక పర్యటన కారణంతో, త్రిష డ్రగ్స్ వ్యవహారంతో కొంచెం వెనుకంజలో ఉండడంతో ఈ అవకాశం తమన్నాకు దక్కింది. ఈ తమిళ వెర్షన్ లో హీరోగా విజయ్ నటించనున్నారు. ఇక తెలుగులో త్రీ ఇడియట్స్ లో మహేష్ బాబు హీరోగా నటించగా, ఇలియానాను హీరోయిన్ గా నటించనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిచనున్నారు. ఈయన తాజా చిత్రం రోబో విడుదలకు సిద్దంగా ఉంది.