దాంతో నాకు పరిపూర్ణత వచ్చేసింది...తమన్నా
'ఆవారా'లో నటించాక నేను పరిపూర్ణమైన నటిని అని గర్వంగా చెప్పుకుంటాను. దక్షిణాదిన ఏ నటి అయినా సరే వాన పాటలో చేస్తే పరిపూర్ణత వచ్చేస్తుందని ఎక్కడో విన్నాను. అలాంటి పాటలో నేనింకా చేయలేదే అని లోలోపల కాస్త బెంగ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు అంటోంది తమన్నా. ఆవారా' ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన తమన్నా తన సినీ జీవితం గురించి, కొత్త చిత్రాల విశేషాల గురించీ మీడియా తో ముచ్చటించింది. 'హ్యాపీడేస్' చిత్రంలోని మధు పాత్రతో తెలుగునాట విజయవంతమయిన ఆమె తమిళంలోనూ ప్రేక్షకులకు చేరువైంది. అక్కడ తమన్నా, కార్తీ కలిసి నటించిన 'పయ్యా' చిత్రం తెలుగులోకి 'ఆవారా' పేరుతో అనువాదమైంది. మే 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అలాగే తమన్నా ఇటీవల నాగచైతన్య, అల్లు అర్జున్ చిత్రాల్లో నటించేందుకు కమిటయ్యింది. అలాగే రవితేజతో రాజమౌళి రూపొందించి హిట్టు కొట్టిన 'విక్రమార్కుడు' రీమేక్‌లో చేస్తోంది. శౌర్యం, శంఖం చిత్రాల దర్శకుడు శివ దీనిని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











