ఫ్లాప్ సినిమా చేసినప్పుడు...తమన్నా
ఫ్లాప్ సినిమా చేసినప్పుడు..ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యిందో తెలుసుకున్నావా? అని కొంతమంది అడుగుతుంటారు. ఫెయిల్యుర్ కి కారణం వెతకడం నాకిష్టం ఉండదు. అలా 'పోస్ట్ మార్టమ్' చేసే పని పెట్టుకోకుండా తదుపరి చిత్రంపై దృష్టి సారిస్తా' అంటున్నారు తమన్నా. ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు 'మంచి' సినిమా అవుతుందనే నమ్మకంతోనే అంగీకరిస్తా. కానీ ఫలితం వేరే విధంగా ఉంటే కచ్చితంగా బాధ కలుగుతుంది అంటోంది. ఆమె నటించిన 'ఆవారా' చిత్రం త్వరలో రిలీజ్ అవనుంది. కార్తీ హీరోగా లింగు స్వామి రూపొందిన పయ్యా చిత్రం తెలుగులో 'ఆవారా' గా డబ్బింగై అయింది. ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నైజాం ఏరియాలో శోభారాణి విడుదల చేస్తున్నారు. సోనియా, మిలింద్ సోమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, చంద్రబోస్, సంగీతం: యువన్ శంకర్ రాజా, ఫొటోగ్రఫీ: మది, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్, దర్శకత్వం: లింగుస్వామి.


Click it and Unblock the Notifications











