అదే నమ్మాను..అందుకే ఇలా: తమన్నా
హ్యాపీ గర్ల్ తమన్నా నూతన సంవత్సంరంలో తన కెరీర్ ఎలా ఉండబోతోందో చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో 'డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్' అనే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. దర్శకుడి గురించి తెలిసిన తర్వాత నా పాత్ర గురించి అడిగి తెలుసుకుంటాను. ఆ పాత్రలో నటనకు ఎంతవరకు స్కోప్ ఉందో ఆలోచిస్తాను.అందుకే కథ వినే ముందు దర్శకుడెవరో అడిగి తెలుసుకుంటాను. ఆ తర్వాతే సినిమాకి సైన్ చేస్తాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
శ్రీ సినిమాతో మొదలైన ఆమె కెరీర్ మొదట బ్రేక్ పడినా హ్యాపీడేస్ తో పరుగుపెట్టింది. ముఖ్యంగా తమిళ తంబీలకు ఆమె పిచ్చపిచ్చగా నచ్చేసింది. అక్కడ జయాపజయాలకు సంభందం లేకుండా సినిమాలు చేసేస్తోంది. తాజాగా సంక్రాంతి కానుకగా 'పయ్యా' విడుదల కానుంది. ఈ చిత్రవిజయంపై తమన్నా నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. అంతేగాక ఆమె ప్రస్తుతం తమిళంలో ఆమె పయ్యా, సురా, తిల్లాలంగడి చిత్రాల్లో చేస్తోంది.
అలాగే పాత్రల ఎంపిక గూర్చి మాట్లాడుతూ... 'గ్లామర్ డాల్'గా కొనసాగడం నాకిష్టం లేదు. నటనకే 'లాంగ్విటీ' ఉంటుందని నమ్మకం. అందుకే ఆ కోవకి చెందిన పాత్రల్నే చేస్తున్నాను. తమన్నా మా ఇంటి అమ్మాయి అని ప్రేక్షకులు అనుకోవాలి. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు ఆ అభిప్రాయాన్ని కలుగజేసే విధంగానే ఉన్నాయి. భవిష్యత్‌లో కూడా అలాంటి పాత్రల్నే చేస్తాను' అంటోంది. సెలెక్టడ్ గా వెళ్తున్న తమన్నాకి కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని మంచి పాత్రలు వచ్చి మరింత వెలుగు వెలగాలని కోరుకుందాం. ప్రస్తుతం ఆమె సుకుమార్ దర్శకత్వంలో వరుణ్ సందేశ్ సరసన చేస్తోంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరిలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











