ప్రేమించిన హీరోచేతిలో మోసపోయిన బద్రినాథ్ హీరోయిన్...!?
తమన్నా, సూర్య తమ్ముడు కార్తీల మధ్య స్నేహబంధాన్ని మించినదే ఉన్నదని మీడియాలో చాలాసార్లు వినిపించింది. సూర్య తనతో కలిసి నటించిన జ్యోతికని పెళ్లి చేసుకున్నట్టే కార్తి కూడా తమన్నాని చేసుకుంటాడని ఊహాగానాలు సాగాయి. అయితే కార్తీ హ్యాపీగా అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటే తమన్నా తన కెరీర్ మీద దృష్టి పెట్టింది.
అయితే తమిళనాడు నుంచి పూర్తిగా మకాం మార్చేసి తెలుగులో సెటిల్ అయిపోయింది. తమిళంలో టాప్ ప్లేస్ వదులుకుని తమన్నా ఎందుకని వచ్చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే దీనికి కారణం కార్తీనే అని కోలీవుడ్ గాసిప్ సర్కిల్స్ అంటున్నాయి. తమన్నాని ఇంటి కోడలిగా చేసుకోవడానికి కార్తీ తండ్రి శివకుమార్ ఇష్టపడలేదట. కనీసం చిన్న కొడుకు పెళ్లయినా తాను కోరుకున్నట్టు జరగాలని పట్టుబట్టాడట. దాంతో కార్తీ తండ్రి మాట కాదనలేక తమన్నాకి హ్యాండివ్వడంతో ఆమె పూర్తిగా తమిళనాడు, తమిళ సినిమాలకి దూరంగా ఉంటోందని భోగట్టా..


Click it and Unblock the Notifications











