తమన్నా.. ఎఫైర్ ఉంది కాబట్టే అంతగా లీనమైందా?
కార్తీకీ.. తమన్నాకి మధ్య మంచి కెమిస్ట్రి వర్కవుట్ అయ్యిందని, ఇద్దరి మధ్య ఎఫైర్ ఉంది కాబట్టే అంతగా లీనమై చేశారని వార్తలు వస్తున్న నేఫద్యంలో మీడియా తమన్నాను ఈ విషయమై ప్రశ్నించింది. దానికి తమన్నా సమాధానంగా...ఈ వార్తలు నా వరకూ వచ్చాయి. నిజానికి నెట్‌లో స్వయంగా నేనే ఈ వార్తలు చదువుకుంటాను కూడా. 'ఆవారా' క్యూట్ లవ్ స్టోరి. కథానుసారం ఈ చిత్రంలో నటించాల్సి వచ్చింది. దానివల్ల రొమాంటిక్ సన్నివేశాల్లో మా మధ్య కెమిస్ట్రి బాగా వర్కవుట్ అయ్యింది. అంత మాత్రాన కార్తీకి, నాకూ మధ్య ఎఫైర్ ఉందనుకోవడం సరి కాదు. మేం ఇద్దరం కలిసి మరో సినిమాలో కూడా ('విక్రమార్కుడు' రీమేక్) నటించబోతున్నాం అని తేల్చేసింది. కార్తీ సరసన ఆమె నటించిన 'ఆవారా' త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











