లైఫ్ ఇచ్చిన డైరక్టర్ కి తమన్నా తల తిరిగే ట్విస్ట్
తమిళంలో తనకు కెరీర్ ఇచ్చినట్లుగా లింగు స్వామి గురించి పదే పదే చెప్తూ వచ్చిన తమన్నా తాజాగా అతనికే సూపర్ ట్విస్ట్ ఇచ్చింది. ఆయన తాజా చిత్రం వేటలో ఆమె నటించటంలేదని తెలిపింది. ఆమెని తన తదుపరి చిత్రానికి తీసుకుంటానని లింగు స్వామి మాట్లాడి, పేపర్ ప్రకటన ఇచ్చేసారు. అయితే ఆ తర్వాత తాను చేయటం లేదని తమన్నా తాపీగా మీడియాకు తెలియచేసింది. కారణం మరేదో కాదు రెమ్యునేషన్ అని తెలిసింది. తమన్నాకు కోటి రూపాయలు వరకు రెమ్యునేషన్ కావాలని పట్టుపట్టింది.
దాంతో అంతకు ముందు చిత్రం ఆవారా కి యాబై లక్షలు మాత్రమే తీసుకున్న తమన్నా ఇప్పుడు ఇలా రెట్టింపు చేసేసరికి లింగుస్వామి షాకై తర్వాత మాట్లాడదామన్నాట్ట. అయితే ఆమె అస్సలు అంత తక్కువకి తాను పని చేయలేనని చెప్పేసి, తాను అస్సలు ఆ సినిమా చేయటం లేదని మీడియాకు చెప్పింది. వెంటనే లింగు స్వామి ఆమె ప్లేసులో అమల పాల్ ని పెట్టేసాడు. ఇక ఈ వేట చిత్రాన్ని తెలుగులో మహేష్ తో చేయటానికి లింగు స్వామి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే తమన్నా ప్రస్తుతం నాగచైతన్య సరసన సుకుమార్ దర్శకత్వంలో రెడీ అవుతున్న చిత్రంలోనూ, అల్లు అర్జున్..బద్రీనాధ్ లోనూ చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ తో సురేంద్రరెడ్డి చిత్రంలోనూ ఆమె బుక్కయింది.


Click it and Unblock the Notifications











