ప్రేమ దోమ కుట్టిందని చిలక పలుకులు పలుకుతోన్న బ్యూటి...
ముంబాయి భామలు చాలామంది తమిళ హీరోలనో, ప్రముఖులనో కట్టుకుని స్థిరపడిపోతుంటారు. ఇదే కోవలోకి ఖుష్బూ, జ్యోతిక వంటివారు వస్తారని చెప్పుకోవచ్చు. నటి తమన్నా కూడా ఇదే జాబితాలో చేరేందుకు ఉబలాటపడుతున్నట్లు భోగట్టా. ఓ తమిళ సినీ ప్రముఖుడితో తమన్నా సన్నిహితంగా మెలగుతున్నట్లు కోలీవుడ్ సినీజనం చెవులు కొరుక్కుంటున్నారు.
ముంబాయికి చెందిన ఈమెకు తొలుత అవకాశాలు లేకపోవడంతో తెలుగులోకి వచ్చి హ్యాపీడేస్ అని, ఆ చిత్రం ద్వారా కెరీర్ బిల్డప్ చేసుకుంది. కోలీవుడ్ లో సెటిలై అవకాశాలను చేజిక్కించుకుంటోంది. అంతా బాగానే ఉంది..అయితే మధ్యలో ఓ సినీహీరోతో చెట్టాపట్టాలేసుకుని తెగ తిరుగుతున్నట్లు భోగట్టా.
ఏంటీ.. మీ ఇద్దరి మధ్యా లవ్వా..? అని అడిగితే...ముసిముసిగా నవ్వుతూ తనకు నచ్చిన వాడినే చేసుకుంటానని చిలుక పలుకులు పలుకుతోంది. ప్రేమ మొదట్లో అలా తీయగానే ఉంటుందనీ, ఆ తర్వాతే చేదుగా మారుతుందన్న విషయం తమన్నాకు తెలిసినట్లు లేదు.
ఆ సంగతి అలా ఉంచితే.. తమన్నా సన్నిహితులు మాత్రం ఆమెకు సలహాలు ఇస్తున్నారట. ఇండస్ట్రీలో అవకాశాలున్నప్పుడే కెరీర్ డెవలప్ చేసుకోవాలనీ, ప్రేమా.. దోమా.. అంటూ వెళితే... సిమ్రాన్‌లా అవకాశాల కోసం పాకులాడాల్సి వస్తుందని సూచిస్తున్నారట. ప్రేమ దోమ కుట్టిన తర్వాత తమన్నా వారి మాటలను ఖాతరు చేస్తుందా..? ఏమో చూడాలి..!!


Click it and Unblock the Notifications











