తమన్నాకి ఎక్కువైనా డిమాండ్
కోలీవుడ్, టాలీవుడ్ తారలు ఎవరైనా సరే నాలుగు సినిమా వరుస విజయాలు సాదిస్తే చాలు గోడమీద పల్లుల్లా బాలీవుడ్ లో దూకుటకు అతి ఉత్పాహం చూపుతున్న ఈ తరుణంలో తమన్న మాత్రం బాలీవుడ్ కి వెళ్ళే ఛాన్సే లేదంటోంది. ఇందతా కోలీవుడ్ పై వున్న ప్రేమ కాదని తను అలా సన్నాయి నొక్కులు నొక్కుతోందని సినిమా వర్గాలు తెలుపుతున్నాయి. అయితే కోలీవుడ్ లో తారలంతా బాలీవుడ్ వైపు వెళ్ళటకు తమ అందచందాలతో, శతవిధాల ప్రయత్నాలు చేస్తుంటే తనకు మాత్రం కోలివుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో ఎడాపెడా చిత్రాలను అంగీకరిస్తూ భలే బిజీగా కనిపిస్తున్నదంటున్నారు.
'హ్యాపీడేస్" చిత్రంతో తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపిన తమన్నా ఇప్పుడు కోలీవుడ్ లో క్షణం తీరిక లేకుండా దూసుకుపోతోంది. అటు తెలుగు ఇటు తమిళ భాషల్లో అగ్రకథానాయిక జాబితాలో వున్నారు. మద్యమద్యలో తెలుగు సినిమాలు చేస్తున్నా తన దృష్టి అంతా కోలీవుడ్ పైనే సారిస్తోంది. కోలీవుడ్ అంటే తమన్నాకీ చాలా ఇష్టమట. కోలీవుడ్ హీరోలు బాగా సహకరిస్తారని ఆమె కు ఒక సధాబిప్రాయం. అందుకే తనకు కోలీవుడ్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది.


Click it and Unblock the Notifications











