రెట్రో లుక్ లో హీరోతో కలిసి తమన్నా (ఫొటో)

By Srikanya

చెన్నై: ఈ క్రింద ఫొటోలో తమన్నా ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి స్ధాయి రెట్రో లుక్ తో ఆమె తన అభిమానులను ఆనందపరచటానికి సిద్దపడుతోంది. తమిళంలో తమన్నా ప్రస్తుతం చేస్తున్న 'Vasuvum Sivavum Onna Padichittanga' లోది ఈ స్టిల్. బాస్ ఎనగర భాస్కరన్(తెలుగులో నేనే అంబాని) దర్శకుడు రాజేష్ డైరక్ట్ చేస్తున్న చిత్రంలో ఆమె ఇలా కొన్ని కొన్ని సన్నివేశాల్లో కనిపించనుంది. ఈ సన్నివేశాలు ఫన్నీగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ ఫొటోలో తమన్నా ని చూస్తుంటే మన పాత చిత్రాల్లోని హీరోయిన్స్ గుర్తు వస్తున్నారు కదూ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పరాజయంతో కెరీర్‌ను ప్రారంభించినా, తొందర్లోనే తన తప్పుల్ని సరిదిద్దుకొనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది తమన్నా. తెలుగునాట స్టార్‌ హీరోలతో జతకట్టింది. తమిళ, హిందీసీమల్ని చుట్టొచ్చింది. ఇప్పుడు మరో రౌండ్ వేస్తోంది. తాజాగా ఆమె రవితేజ సరసన నటించనుందని సమాచారం. రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకుడుగా రూపొందే చిత్రంలో ఆమెను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రచ్చ లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ కిక్ 2 పూర్తైన వెంటనే ఈ చిత్రం షూటింగ్ కి వస్తారు.

Tamanna goes retro for Arya

తమన్నా మాట్లాడుతూ ''ఏ విషయంలోనైనా సానుకూల దృక్పథంతో నడుచుకొంటా. నాకు స్నేహితులెక్కువ. అదే నా బలం. అన్ని వయసులవారితోనూ స్నేహం చేస్తా. నా స్నేహితుల్లో నాకంటే పెద్ద వయసున్నవాళ్లున్నారు. చిన్న పిల్లలూ ఉన్నారు. అన్ని వర్గాల అభిరుచుల్నీ తెలుసుకోవడానికి నాకిదో మార్గంగా కనిపించింది. నన్ను ఎవరు, ఎలా చూడాలనుకొంటున్నారనే విషయంలో నాకో నిశ్చితమైన అభిప్రాయం ఉంది. నా సినిమాల గురించి వాళ్లతో మాట్లాడతాను'' అంది.

అలాగే... ''ఏ విషయంలో తప్పు చేశాను? ఎక్కడ పొరపడ్డానో వాళ్లే చెప్పేస్తుంటారు. నా సినిమా విడుదలైందంటే గంటకో రివ్యూ ఇస్తుంటారు. వాళ్ల అభిప్రాయాలకు నేనూ విలువ ఇస్తా. నా దృష్టిలో నా స్నేహితులే ఉత్తమ విమర్శకులు'' అని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం 'బాహుబలి'లో ప్రభాస్‌ సరసన నటిస్తోంది. 2015లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X