జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నీ చూసుకొని అమాంతంగా పెంచేసింది...!

By Sindhu

తమన్నాకి ఒక్కసారిగా టాలీవుడ్ లో 'హ్యాపిడేస్" స్టార్ట్ అయ్యాయి. నిన్న మొన్నటివరకు తననెవరూ పట్టించుకోకపోయినా ఇప్పుడీ మిల్క్ బ్యూటీ మీద మన యువ హీరోలు కన్నేస్తున్నారు. అల్లు అర్జున్ తో 'బద్రీనాథ్" లో నటిస్తున్న తమన్నాతాజాగా జూ ఎన్టీఆర్ తో 'అతడే ఆమె సైన్యం" చిత్రంలో నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది. సురేందర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రెండు పెద్ద చిత్రాలు తన వశం కావడంతో తమన్నా అమాంతం తన పారితోషికం పెంచేసింది.

తెలుగు నిర్మాతల వరకు రెమ్యూనరేషన్ విషయంలో పట్టు విడుపులు చూపుతున్నా, తమిళ నిర్మాతలకయితే రెమ్యూనరేషన్ తగ్గించే ప్రసక్తే లేదని ఆమె అంటోంది. ఇన్నాళ్లూ తమిళ చిత్రమసీమ తమన్నాని నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు వాళ్లనే ఆమె లెక్క చేయట్లేదు. ఆ మద్యన దశావతారం డైరెక్టర్ కె యస్ రవికుమార్ ఆయన తీయబోయే నెక్ట్స్ సినిమాలో కమల్ హాసన్ సరసన నటించుటకు ఆఫర్ ఇచ్చాడంట. అంతే అందులో హీరోతో కిసింగ్ సీన్ ఉండటంతో తన రెమ్యూనరేషన్ అమాంతంగా రూ. కోటి ఇరవై ఐదు లక్షలకు పెంచేసింది. మొదట్నుంచీ తెలుగు సినీ పరిశ్రమ మీదే ఎక్కువ ఆసక్తి చూపించిన తమన్నాకి ఇక్కడ లేటుగా బ్రేక్ వచ్చింది. ఇక్కడ బ్రేకొచ్చేవరకు తమన్నా అక్కడ టైమ్ పాస్ చేసి ఇప్పుడిక్కడే హ్యాపీగా సెటిలైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X