తమన్నాపై బ్యాన్ కి కారణం రామ్ చరణ్!?
తమన్నా బ్యాన్ చేయాలా వద్దా అనే ఆలోచనలో తమిళ చిత్ర పరిశ్రమ పడిందని సమాచారం. కారణం ఆమె శ్రీలంక వెళ్ళి షూటింగ్ చేయటమే అంటన్నారు. తమ ఫర్మిషన్ లేకుండా శ్రీలంక వెళ్ళే ఆర్డిస్టులను అక్కడ పరిశ్రమ క్షమించదు. గతంలోనూ ఈ విషయమై అనేక వివాదాలు జరిగాయి. తాజాగా తమన్నా ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం శ్రీలంక వెళ్ళింది.అదీ రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ కోసం. దాంతో ఇప్పుడు ఆమెపై ఏ నిర్ణయం తీసుకోవాలనేది చర్చగా మారిందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. అయితే తమళ షూటింగ్ కోసం కాదు కదా అని కొందరు వాదిస్తున్నారు. మరోప్రక్క ఆమెకు కార్తి వంటి స్టార్ హీరోల సపోర్టు ఉండటం కూడా ప్లస్ గా మారే అవకాశం ఉంది.
ఇక రామ్ చరణ్ రచ్చ షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అలాగే 'రచ్చ' లో చిరంజీవి గ్యాంగ్‌లీడర్‌లోని టైటిల్ సాంగ్‌ని రీమిక్స్ చేస్తున్నారు. మెగా సూపర్‌గుడ్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. వందశాతం మాస్ చిత్రమిదని, కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











