అనుష్క కంటే కూడా హాట్ హాట్ గా కనిపించిన తమన్నా..
గతంలో 'విక్రమార్కుడు' చిత్రంలో అనుష్క, రవితేజతో రోమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క కాస్త హాట్ హాట్ గా కనిపించి కుర్రకారును కవ్వించారు కూడా. ఇప్పుడు తమిళంలో అదే పాత్రను తమన్నా చేస్తున్నారు.
సూర్య సోదరుడు కార్తీ హీరోగా శివ దర్శకత్వంలో 'విక్రమార్కుడు' చిత్రం తమిళంలోకి 'చిరుతై'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఈ మిల్కీ వైట్ భామ నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క తరహాలోనే ఈ తార కూడా ఆహోట్ హాట్ గా నటిస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఇప్పటి వరకు ఏ చిత్రంలో కనిపించనంత రొమాంటిక్ గా, అందంగా ఈ పాలబుగ్గల సుందరి ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం పబ్లిసిటీ స్టిల్స్ చూసిన తమిళ జనాలు అనుష్కను మరిపించేలా తమన్నా వున్నారని కితాబులు ఇస్తున్నారు. ఇంతకముందే 'ఆవారా' (తమిళంలో పయ్యా) చిత్రంలో జోడి గా కనిపించిన కార్తీ, తమన్నాల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ఈ చిత్రంలో బాగా కుదిరిందని 'చిరుతై' యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు కోలీవుడ్ కుర్రకారంతా ఈ చిత్రం విడుదల గురుంచే ఎదురు చూస్తున్నారట.


Click it and Unblock the Notifications











