నేను ప్రేమలో పడ్డా కరెక్టే: తమన్నా
హ్యాపీ గర్ల్ తమన్నా వరసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఆమెను మీడియావారు మీరు ప్రేమలో పడ్డారని తెలిసింది అంటే.. అవును పడ్డానని వారికి షాక్ ఇచ్చింది. ఎవరితో పడ్డారు.. డిటేల్స్ చెప్పండి అంటే నా కెరీర్ తో, సినిమాతో అని చమత్కారంగా చెప్పి వారిని నవ్వుల్లో ముంచేసింది. తమన్నా అప్పట్లో కార్తితో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. అయితే కార్తికి వివాహం జరగటంతో ఆ వార్తలు వాటంతట అవే ఆగిపోయాయి. అయితే మీడియా మాత్రం అప్పుడప్పుడూ ఆమెను ప్రేమ, పెళ్లి గురించి అడుగుతూ ఆరాలు తీస్తూనే ఉంది.
అయితే మిగతా హీరోయిన్స్ లాగ కాకుండా మీడియాతో మంచిగా ఉంటూ నవ్వుతూ వాటిని ఖండిస్తోంది. ప్రస్తుతం తమన్నా ఎన్టీఆర్ సరసన ఊసరివిల్లి చిత్రంలో చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె గతం మర్చిపోయే అమ్మాయిగా కనిపించనుంది. అలాగే రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలో ఆమె డబ్బున్న అమ్మాయిగా కనిపించనుంది. వీటితో పాటు ఆమె రామ్ సరసన కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలోనూ చేస్తోంది. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నా ఆమె కొత్తగా ఏమీ కమిట్ కావటం లేదు. డేట్స్ ఖాళీ లేవని పూర్తిగా తెలుగు మీదే కాన్సర్టేట్ చేసింది.


Click it and Unblock the Notifications











