తమన్నా కొత్త చిత్రం టైటిల్ 'ప్రియా ...ప్రియతమా'
హ్యాపీడేస్ చిత్రంతో పరిచయమైన తమన్నాకి తమిళ,తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉంది. దాంతో ఆమె నటించిన ఇక్కడ సినిమాలు అక్కడకి,అక్కడ ఆమె చేసిన సినిమాలు ఇక్కడకు డబ్బింగై పోతున్నాయి.ఆమధ్య హిందీ సూపర్ హిట్ జబ్ వుయ్ మెట్ కు రీమేక్ కు తమిళంలో చేసిన చిత్రాన్ని "ప్రియా...ప్రియతమా" గా డబ్బింగ చేసి తెలుగులోకి దింపుతున్నారు. తమిళంలో అంతంత మాత్రంగా వర్కువుట్ అయిన ఈ చిత్రంలో హీరోగా భరత్ చేసారు. ఇక ఆ.కన్నన్ డైరక్ట్ చేసిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. వెన్నెల కంటి డైలాగులు రాస్తున్నారు. ఊటీ,కొడైకెనాల్, పొల్లాచ్చి, మధురై, చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ప్రస్తుతం తమన్నా..నాగచైతన్య సరసన ఐలవ్ యు అనే చిత్రంలోనూ, అల్లు అర్జున్ సరసన బద్రీనాధ్ చిత్రంలోనూ చేస్తోంది. అలాగే ఎన్టీఆర్, సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందనున్న రచ్చ చిత్రంలోనూ ఎంపికైంది.


Click it and Unblock the Notifications











