మినిమం రెండు బీర్లు అయినా లాగించందే తమన్నా రిలాక్స్ అవదు అంటూ తమిళ పత్రికలు ఆమె గురించి తెగ రాస్తున్నాయి. అంతేగాక ఆమె ఆ అలవాటు కనుక మానేయకుంటే నీల, గజాల వంటి హీరోయిన్స్ లా ఫేడవుట్ అవ్వాల్సిన పరిస్ధితి వస్తుందంటూ హెచ్చరించాయి. బాలాజీ శక్తి వేలు వంటి కమర్షియల్ డైరక్టర్ చేతిలో పడుతున్న ఈ సమయంలో ఆమె తన బీర్ సేవనంపై దృష్టి తగ్గిస్తే మంచిదని సలహా ఇస్తున్నాయి. ఇక తమన్నాకు ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా తెగ తాగుతుందంటూ వారు చెప్తున్నారు. అయితే ఆమె ఒక్కర్తే కూచుని తాగదట. తన స్నేహితులందరినీ పిలిచి పార్టీ ఏర్పాటు చేసి మరీ తాగుతుందట. ఇదంతా హై సర్కిల్స్ లో కామన్ అని ఆమె తరపు వాళ్లు చెప్తున్నారు. ఈ మధ్య ఆమె పారితోషికం బాగా పెంచటంతో తట్టుకోలేక ఆనందంతో ప్రెండ్స్ కి ఓ పెద్ద పార్టీ ఇచ్చి అందరి దృష్టిలో పడింది. వాళ్ళని తాగినంత తాగి, తిన్నంత తినమని హుషారు చేసిందట. అదీ సంగతి.