హద్దులు దాటుతున్న గోపీచంద్ కి ఓకే అన్న తమన్నా..!
ఇన్నాళ్లూ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన యంగ్ హీరో గోపీచంద్, తాజాగా 'మొగుడు' పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెల్సిందే. కృష్ణవంశీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
ఇదిలా ఉంచితే, గోపీచంద్ మన సరిహద్దులు దాటి తమిళనాడుకి కూడా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. తొలిసారిగా ఓ తమిళ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు భూపతి పాండ్యన్ దీనికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. భూపతి చెప్పిన కథ గోపీకి బాగా నచ్చిందని అంటున్నారు. ఈ చిత్రం తనదైన యాక్షన్ బాణీలోనే వుంటుందంట. గోపించద్ కూడా తమిళ ఆడియెన్స్ కి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.
కాగా గతంలో గోపిచంద్ సరసన టాప్ హీరోయిన్స్ అయిన అనుష్క, త్రిష, వంటి వారు నటించారు. అంతటి క్రేజ్ ఇప్పుడు మళ్లీ రావాలంటే టాప్ హీరోయిన్ తో నటించాల్సిందే అని డిసైడ్ తమన్నా హీరోయిన్ గా సర్ ప్రైజ్ ఇవ్వబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ లో చిన్న హీరోల నుండి టాప్ హీరోల వరకు అందరితో నటిస్తూ తనకంటూ ఓ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం తమిళంలో టాలీవుడ్ హీరో గోపిచంద్ నటించే సినిమాకు ఓకే చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











