మన లవ్ స్టోరికి పట్టుబట్టి మిల్కీ బ్యూటీని ఎంపిక చేసిన హీరో...!
కష్టపడి సంపాదించుకున్న స్థానం చేజారిపోతుంటే ఎవరికైనా బాధగానే వుంటుంది కదా… మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా బాధ కూడా ప్రస్తుతం అటువంటిదే. నిన్నటి వరకు తమిళ సినిమా రంగంలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించిన ఈ ముంబై భామకు ఇప్పుడు అనుష్క భయం పట్టుకుందట. తమిళ సినిమాలు వరుసగా ఒప్పేసుకుంటూ, అనుష్క తనకి పోటీగా రావడంతో తన కుర్చీని ఆమె ఎక్కడ లాగేసుకుంటుందోనన్న అభద్రతాభావం ఈమెను పట్టిపీడిస్తోందట.
దాంతో, ఆమె పోటీని తట్టుకుని నిలబడడానికి అభినయానికి ఆస్కారం వున్న'అరుంధతి" లాంటి పాత్రలు చేయాలని తమన్నా ఆలోచిస్తోందని అంటున్నారు. అందుకే, తన దగ్గరకొచ్చే దర్శక, నిర్మాతలకు తనతో అలాంటి సినిమాలు ప్లాన్ చేయమని సలహాలిస్తోందట. ఆమె మాట పట్టుకుని ఆ టైపు సినిమాలు తీసి, ఫ్లాప్ అయితే తమ పరిస్థితి ఏమిటని నిర్మాతలు అడుగుతున్నారు. అదే కమర్షియల్ సినిమాలైతే ఏదో మినిమం గ్యారంటీ ఉంటుందన్నది వాళ్ల ఉద్దేశం.
కాగా తెలుగులలో ప్రస్తుతం యంగ్ హీరోలలో వెనుకపడిపోయిన రామ్ ఒక హిట్ కోసం ఈమధ్య పరితపిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రస్తుతం హన్సికతో 'కందిరీగ' సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ఓ ప్రేమకథను చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి ప్రేమకథల స్పెషలిష్టు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం కరుణాకరన్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నాడు. కాగా, పరుచూరి ప్రసాద్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా ఎంపికైనట్టు తెలుస్తోంది. రెమ్యునేరేషన్ కాస్త ఎక్కువైనప్పటికీ తమన్నానే బుక్ చేయమని దర్శకుడితో బాటు హీరో రామ్ కూడా పట్టుబట్టినట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి 'మన లవ్ స్టోరీ' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారట..!


Click it and Unblock the Notifications











