రామ్ చిత్రం ఒప్పుకోవటానికి తమన్నా కారణం
తమన్నా దృష్టి ఇఫ్పుడు పూర్తిగా తెలుగు పరిశ్రమపై పెట్టింది. వరసగా సినిమాలు ఒప్పుకుంటోంది. అల్లు అర్జున్ తో బద్రీనాధ్ చిత్రం చేస్తున్న ఆమె నాగచైతన్యతో సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. ఆ చిత్రం పూర్తి కాకుండానే ఎన్టీఆర్ సరసన సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నటించటానికి కమిటైంది. తాజాగా రామ్ సరసన కూడా ఆమె సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. యూనైటెడ్ మూవీ పతాకంపై రూపొందే ఈ చిత్రం ఈ వేసవిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇక ఈ చిత్రం ఒప్పుకోవటానికి కారణం దర్శకుడు కరణాకరన్ అని తెలుస్తోంది. తన సినిమాల్లో హీరోయిన్ గా ప్రాముఖ్యత ఉన్న రోల్ ని తీర్చి దిద్దుతాడని, అలాగే ఈ చిత్రంలోనూ ఆమె పాత్ర కథకు కీలకంగా ఉంటుందని, హీరోయిన్ అంటే డాన్స్ లకు పరిమితం కాకుండా ఉండటమే ఆమె రామ్ సరసన కమిటవటానికి కారణమని తెలుస్తోంది.
More from Filmibeat
తమన్నా రామ్ కరుణాకరన్ నాగచైతన్య బద్రీనాధ్ రచ్చ tamanna ram karunakaran rachcha naga chaitanya badrinath


Click it and Unblock the Notifications











